Gold Loans: తక్కువ వడ్డీకే గోల్డ్ లోన్ తీసుకోవాలని ట్రై చేస్తున్నారా? అయితే ఈ బ్యాంకుల్లో ట్రై చేయండి
Gold Loans: మనలో చాలా మందికి అవసరాలు, అనుకోకుండా వచ్చిన ఖర్చులు, వైద్య చికిత్సల కోసం తప్పనిసరిగా లోన్స్ తీసుకుంటారు. వీటికోసం సాధారణంగా బ్యాంకులను ఆశ్రయిస్తుంటారు. బ్యాంకుల్లో పర్సనల్ లోన్స్ కు వడ్డీ రేటు ఎక్కువగా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే క్రెడిట్ స్కోర్, మన ఆదాయం తదితర వివరాలను పరిశీలించి లోన్ మంజూరు చేస్తుంటారు. అయితే బ్యాంకుల నుంచి బంగారం రుణంను చాలా సులభంగా తీసుకోవచ్చు. ప్రాసెసింగ్ ఫీజులతోపాటు తక్కువ వడ్డీకే, తక్కువ సమయంలో లోన్స్ అందిస్తారు. ఈ నేపథ్యంలో పలు బ్యాంకులు అందిస్తున్న గోల్డ్ లోన్స్, వాటి, వడ్డీ రేట్ల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
అత్యవసర సమయంలో బంగారు ఆభరణాలను బ్యాంకుల్లో తాకట్టు పెట్టిలోన్స్ పొందవచ్చు. వీటిపై వడ్డీ రేటు కూడా తక్కువగా ఉంటుంది. ముందుగా లోన్ తీసుకోవాలనుకున్న బ్యాంకును సెలక్ట్ చేసుకోవాలి. అక్కడ బ్యాంకు సిబ్బంది మీ బంగారాన్ని తూకం వేసి..కేవైసీ ప్రక్రియను పూర్తి చేస్తారు. ఆ బంగారంపై మీకు లభించే లోన్ వడ్డీరేటు తిరిగే చెల్లించే వాయిదాల గురించి మీకు చెబుతారు.
బ్యాంకు రుణ మొత్తాన్ని బట్టి ఈ లోన్స్ పై వడ్డీ రేట్లు మారుతుంటాయి. బంగారం విలువపై 65శాతం నుంచి 75శాతం వరకు రుణాన్ని పొందుతారు. లోన్ ప్రాసెస్ సమయం ఫీజులు బ్యాంకును బట్టి మారుతుంటాయి. చాలా బ్యాంకులు రుణ మొత్తంలో 0.50శాతం నుంచి 1శాతం వరకు ప్రాసెసింగ్ చార్జీగా వసూలు చేస్తుంటాయి. లోన్ తిరిగి చెల్లించే కాల వ్యవధి 3 నెలల నుంచి 4 ఏళ్ల వరకు ఉంటుంది.
కోటక్ మహీంద్రా బ్యాంక్ లో బంగారు రుణాలపై 9 శాతం వరకూ వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజుగా 2శాతం, జీఎస్ టీ ఉంటుంది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ లో 9.30 శాతం వడ్డీరేటు, మంజూరు చేసిన సొమ్ములో ఒక శాతం ప్రాసెసింగ్ ఫీజు వస్తూలు చేస్తున్నారు.
సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 8.45 నుంచి 8.55 శాతం వడ్డీ, లోన్ మొత్తంలొో 0.50 శాతం ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి. యూకో బ్యాంకులో 8.50 శాతం వడ్డీ ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.యూనియన్ బ్యాంకులో 8.65 నుంచి 9.90 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు. ప్రాసెసింగ్ ఫీజు లేదు.
పంజాబ్ నేషనల్ బ్యాంకులో 9.15 శాతం వడ్డీతోపాటు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.కెనరా బ్యాంకులో 9 శాతం వడ్డీ ప్రాసెసింగ్ ఫీజు చెల్లించాలి.ఐసీఐసీఐ బ్యాంకులో 9.25 శాతం వడ్డీ, లోన్ మొత్తంలో ఒకశాతం ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది.