Hero Splendor Plus Xtech: పిచ్చెక్కించే ఫీచర్లతో హీరో స్ల్పెండర్ బైక్..ధర, స్పెసిఫికేషన్స్ చూస్తే ఫిదావ్వాల్సిందే

Sun, 08 Sep 2024-5:43 pm,

హీరో మోటోకార్ప్..మనదేశంలో విశ్వసనీయ టూవీలర్ వాహనతయారుదారీగా పేరు సంపాదించింది. దేశీయ మార్కెట్లో ఆకట్టుకునే ఫీచర్లతో పలు మోటార్ సైకిల్లను, స్కూటర్స్ ను విక్రయిస్తోంది. కస్టమర్లు  కూడా ఈ హీరో బైకులంటే ఇష్టంగా కొనుగోలు చేస్తుంటారు. కొత్త ఫీచర్లతో కూడిన స్ప్లెండర్ బైక్ ను హీరో కంపెనీ ఈ మధ్యే మార్కెట్లోకి రిలీజ్ చేసింది. కొత్త మోటార్ సైకిల్ ధర, స్పెసిఫికేషన్ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. 

ఫ్రంట్ డిస్క్ బ్రేకుతో అప్ డేట్ చేసిన ఈ స్ల్పెండర్ చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసేందుకు అందుబాటులో ఉంది. దీని ఎక్స్ షోరూమ్ ధర రూ. 83,461. ఈ డిస్క్ బ్రేక్ ఫీచర్ స్ప్లెండర్ ప్లస్ ఎక్స్ టెక్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంది.   

ఈ హీరో స్ల్పెండర్ ప్లస్ ఎక్స్ టెక్ బైక్ లో 97. 2 సిసి సింగిల్ సిలిండర్ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ ఉంటుంది. గరిష్టంగా 7.9బీహెచ్పీ పవర్, 8.04 ఎన్ఎన్ గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 4 స్పీడ్ గేర్ బాకస్ ను డిజైన్ చేసి ఉంది. కొత్త మోటార్ సైకిల్ బ్లాక్ స్కార్పింగ్ బ్లూ, బ్లాక్ టోర్నాడో గ్రే, బ్లాక్ రెడ్ అనే మూడు ఆకర్షణీయమైన కలర్స్ లో కస్టమర్ల కోసం అందుబాటులో ఉంది. ఎల్ఈడీ హెడ్ ల్యాంప్, బ్లూటూత్ కనెక్టివిటితో కూడిన డిజిటల్ ఇన్ స్ట్రూమెంట్ కన్సోల్ , 13ఎస్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ ఇందులో ఉంది. బైక్ లో సైడ్ స్టాండ్ కట్ ఆఫ్ తో సహా పలు ఆకట్టుకునే ఫీచర్లు ఈ బైకులో ఉన్నాయి.   

ఇక ఈ బైక్ బ్యాక్ సైడ్ 130 డ్రమ్ బ్రేక్ సిస్టమ్ తో ముందు 240 ఎంఎం డిస్క్ బ్రేక్ తో డిజైన్ చేశారు. ఇందులో ఐబీఎస్ కూడా ఉంది. ఫ్రంట్ సైడ్ టెలిస్కోపిక్ ఫోర్కులు, బ్యాక్ సైడ్ 5 స్టేప్స్ అడ్జస్టబుల్ డ్యూయల్ షాక్ సస్పెన్షన్స్ సెటప్ ఉంది.   

హీరో గ్లామర్ కొత్త కలర్స్ తో కొనుగోలు చేసేందుకు రెడీ గాఉంది. బైక్ బ్లాక్ మెటాలిక్ సిల్వర్ అనే కలర్స్ ఆప్షన్స్ లో అందుబాటులో ఉంది. ఈ న్యూ కలర్స్ తో వచ్చిన డ్రమ్ బ్రేక్ వేరియంట్ మోడల్ ధర రూ. 83, 598, డిస్క్ బ్రేక్ వేరియంగ్ ధర రూ. 87,598గా ఉంది.   

ఇక ఇంజన్ గురించి మాట్లాడుకుంటే హీరో గ్లామర్ మోటార్ సైకిల్ 124.7సీసీ ఎయిర్ కూల్డ్ పెట్రోల్ ఇంజన్ వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ ఉంటుంది. 55కేఎంపీఎల్ వరకు మైలేజీని అందిస్తుందని కంపెనీ తెలిపింది. ఎల్ఈడీ హెడ్ లైట్, డిజిటల్ ఇన్ స్ట్రుమెంటేషన్ స్క్రీన్, స్మార్ట్ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్, ఐడిల్ స్టార్ట్ స్టాప్ సిస్టమ్ వంటి ఫీచర్లు ఎన్నో ఈ బైకులో ఉన్నాయి. టూవీలర్ బైక్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్న వారికి ఇది బెస్ట్ ఆప్షన్ అని చెప్పవచ్చు. ధర కూడా లక్ష లూపే కాబట్టి బడ్జెట్ ధరలో ఈ బైక్ అందుబాటులో ఉంది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link