Hero Shivaji: బుల్లితెరపై సరికొత్త పాత్రలో హీరో శివాజీ ఎంట్రీ.. ఈసారి అంతకుమించి..!
హీరో శివాజీ సరికొత్త పాత్రలో బుల్లితెరపై ఎంట్రీ ఇవ్వనున్నారు. ఈటీవీలో ఓ కామెడీ షోకు జడ్జిగా రానున్నారు.
అయితే ఆయన ఏ షోకు న్యాయనిర్ణేతగా రాబోతున్నారనే విషయంపై క్లారిటీ లేదు.
బిగ్‌బాస్ హౌస్‌లో శివాజీ తన ఆటతీరు ఆకట్టుకున్నారు. విన్నర్ పల్లవి ప్రశాంత్‌కు వెన్నంటే ఉన్నారు.
గేమ్ చివరి వరకు అన్నదమ్ములా కలిసి ఉన్నారు. శివాజీ మూడోస్థానంలో నిలిచినా.. పల్లవి ప్రశాంత్ విన్నర్ కావడంతో చాలా సంతోషడ్డారు.
బిగ్‌బాస్ షో తరువాత 90s వెబ్ సిరీస్‌తో మళ్లీ క్రేజ్ తెచ్చుకున్నారు. ఇప్పుడు బుల్లితెరపై ఏ షో ద్వారా శివాజీ అలరిస్తారో చూడాలి మరి.