Bigg Boss Telugu 8: హోస్ట్ నాగార్జున పై బిగ్ బాస్ కంటెస్టెంట్ ఫైర్.. కారణం..?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్న ఏకైక ఎంటర్టైన్మెంట్ షో బిగ్ బాస్. ప్రస్తుతం ఎనిమిదవ సీజన్ జరుపుకుంటుంది. ఇక ఈ సీజన్ కి కూడా హోస్ట్ గా నాగార్జున వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ప్రతి శని, ఆదివారాలలో వారం మొత్తం కంటెస్టెంట్ లు చేసిన తప్పులను సరిదిద్దుతూ బాగా ఆడిన వారిని మెచ్చుకుంటూ ప్రేక్షకులకు మంచి వినోదాన్ని పంచుతూ ఉంటారు.
అంతేకాదు అప్పుడప్పుడు కంటెస్టెంట్స్ కి సంబంధించిన ముఖ్య విషయాలను కూడా రాబట్టే ప్రయత్నం చేస్తూ ఉంటారు. ఈ నేపథ్యంలోనే ఒక బిగ్ బాస్ కంటెస్టెంట్ పై ఆయన చేసిన కామెంట్లు వారికి నచ్చక ఆయనపై విరుచుకుపడినట్లు సమాచారం. మరి అసలు విషయం ఏమిటో ఇప్పుడు చూద్దాం.
ప్రతివారం కంటెస్టెంట్ లను కడిగిపారేసే నాగార్జున ఈసారి ఒకటి రెండు తప్పులను మాత్రమే చూపిస్తూ.. చాలా కూల్ గానే వ్యవహరించారు. ఇక ఎప్పుడూ బిగ్ బాస్ హౌస్లో ఉన్న కంటెస్టెంట్ల సీక్రెట్స్ బయటకు తీసి బిగ్ బాస్ ప్రేక్షకులకు చూపించే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఈసారి నిజాలు తెలుసుకున్న ప్రేక్షకులు బిగ్బాస్ నిర్వహకులపై ఫైర్ అవుతున్నారు. ఎందుకంటే కంటెస్టెంట్ల గురించి అలా చూపించి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలనుకోవడం తప్పు అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదంతా పక్కన పెడితే.. ఈ వారం లేడీ కంటెస్టెంట్ యష్మి నాగార్జునపై చిరాకు పడింది. గౌతమ్ మరియు యష్మీకి బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా చిన్న చిన్న వివాదాలు జరిగిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో అప్పటినుంచి గౌతమ్ పై యష్మీ కాస్త కోపం పెంచుకుంది. గౌతమ్ వలనే ఓడిపోయాను అనడం, అతడి పై బురదజల్లే ప్రయత్నం కూడా చేసింది. అలాగే ఎల్లో కార్డు మీ టీమ్ కి ఇస్తాము.. గౌతమ్ ను తీసేయాలని నిఖిల్ యష్మీ ను గదిలోకి పిలిచి మరీ చెబుతాడు.
ఇక ఈ విషయంపై నాగార్జున మాట్లాడుతూ.. గౌతమ్ విషయంలో నిఖిల్ యష్మీ ను మ్యానిపులేట్ చేశాడు అంటూ నాగార్జున చెబుతాడు. దీంతో యష్మీ వెంటనే అయ్యో లేదు సార్.. మీరు అలా చెప్పకండి అంటూ కామెంట్ చేసింది. ఏమో పృథ్వి కూడా అలాగే అంటున్నాడు అంటూ కామెంట్ చేశారు నాగార్జున. ఇక యష్మి చికాకు పడుతూ ఏంటి నిజమా..? అంటూ అంటుంది. వాస్తవాలు బయట పెడితే హోస్ట్ నాగార్జున పై నే చిరాకు పడుతూ మాట్లాడుతుందా అంటూ యష్మీ పై నెగిటివ్ కామెంట్స్ స్ప్రెడ్ చేస్తున్నారు.