Best Mileage Cars: ధర తక్కువ.. మైలేజ్ ఎక్కువ.. మన దేశంలో భారీగా అమ్ముడవుతున్న కార్లు ఇవే..!
నెక్సా డీలర్‌షిప్‌ల ద్వారా మారుతి బాలెనో లభిస్తోంది. ఈ కారు పెట్రోల్, సీఎన్‌జీ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది. వేరియంట్లు రూ.8.40 లక్షల నుంచి మొదలవుతున్నాయి. ఈ కారు 30.61 కి.మీ/కిలో మైలేజీతో వస్తుంది.
మారుతి స్విఫ్ట్ కారు రూ.6.49 లక్షల నుంచి రూ.9.59 లక్షల వరకు మార్కెట్‌లో అందుబాటులో ఉంది. ఇందులో సీఎన్‌జీ వేరియంట్‌ల విషయానికి వస్తే.. రూ.8.20 లక్షల నుంచి లభిస్తున్నాయి. స్విఫ్ట్ CNG 32.85 km/kg మైలేజీ ఇస్తుంది.
మారుతి వ్యాగన్ ఆర్ కారు రూ.5.55 లక్షల నుంచి రూ. 7.33 లక్షల మధ్య రేటులో లభిస్తోంది. వ్యాగన్ ఆర్ సీఎన్‌జీ మోడ్‌లో 33.48 కిమీ/కిలో మైలేజీని ఇస్తోంది. వ్యాగన్ R CNG వేరియంట్లు రూ.6.45 లక్షల నుంచి లభిస్తున్నాయి.
మారుతి ఆల్టో కె10 కారు రూ.3.99 లక్షల నుంచి రూ.5.96 లక్షల వరకు అందుబాటులో ఉన్నాయి. ఆల్టో కె10 సీఎన్‌జీపై 33.85 కిమీ/కిలో మైలేజీతో మార్కెట్‌లోకి వస్తుంది. సీఎన్‌జీ బేస్ వేరియంట్ ధర రూ.5.74 లక్షలుగా ఉంది.
మారుతి సెలెరియో కారు ధర రూ.5.37 లక్షల నుంచి రూ.7.05 లక్షల మధ్యలో ఉంటుంది. సెలెరియో సీఎన్‌జీ వేరియంట్ ధర రూ.6.74 లక్షలు ఉండగా.. 34.43 కి.మీ/కిలో మైలేజీతో వస్తుంది. ఇది మన దేశంలో అత్యధిక మైలేజ్ ఇచ్చే సీఎన్‌జీ కారుగా ఉంది.