Hit Combinations: రామ్ చరణ్, సుకుమార్ సహా హిట్ కాంబినేషన్స్ రిపీట్ చేస్తున్న స్టార్ హీరోలు.. Part-1

Tue, 26 Mar 2024-10:31 am,

రామ్ చరణ్ - సుకుమార్.. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత రామ్ చరణ్, సుకుమార్ మరోసారి కలిసి పనిచేయబోతున్నారు. తాజాగా హోలి సందర్భంగా వీళ్ల కాంబినేషన్ సెట్ అయింది. మైత్రీ మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ ఈ సినిమాను సంయుక్తంగా తెరకెక్కిస్తున్నారు.

అల్లు అర్జున్ - సుకుమార్.. ఇప్పటికే అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో ఆర్య, ఆర్య2, పుష్ప వంటి సినిమాలు వచ్చాయి. అందులో ఆర్య 2 మాత్రమే సక్సెస్ కాలేదు. మిగతా సినిమాలన్ని హిట్ అనిపించుకున్నాయి. ఇపుడు వీళ్ల కాంబినేషన్‌లో పుష్ప 2 ది రూల్ రాబోతుంది. ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

బాలకృష్ణ - బోయపాటి శ్రీను ఇప్పటికే బాలకృష్ణ, బోయపాటి శ్రీను కలయికలో సింహా, లెజెండ్, అఖండ వంటి హాట్రిక్ హిట్స్ ఉన్నాయి. ఇపుడు వీళ్ల కలయికలో అఖండ 2 రాబోతుంది. ఈ సినిమాను ఉగాది కానుకగా అఫీషియల్‌గా ప్రకటించనున్నారు.

పవన్ కళ్యాణ్ - హరీష్ శంకర్.. గబ్బర్ సింగ్ వంటి హిట్ బ్లాక్ బస్టర్ తర్వాత పవన్ కళ్యాణ్, హరీష్ శంకర్ కలయికలో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమా రాబోతుంది. ఈ సినిమాపై సినీ ఇండస్ట్రీలో భారీ అంచనాలే ఉన్నాయి.

ఎన్టీఆర్ - కొరటాల శివ ఎన్టీఆర్, కొరటాల శివ కాంబినేషన్‌లో గతంలో 'జనతా గ్యారేజ్' వంటి బ్లాక్ బస్టర్ తర్వాత మరోసారి దేవర సినిమా కోసం పనిచేస్తున్నారు. ఈ సినిమా ఈ యేడాదే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. అంతేకాదు ఈ సినిమా తర్వాత దేవర 2 సినిమా రాబోతుంది.

రవితేజ - గోపిచంద్ మలినేని

రవితేజ, గోపిచంద్ మలినేని కాంబినేషన్‌లో డాన్ శీను, బలుపు, క్రాక్ వంటి హాట్రిక్ హిట్స్ తర్వాత ఇపుడు నాల్గోసారి ఈ కాంబినేషన్‌కు రంగం సిద్ధం అయింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link