Job Fair 2024: యువతకు సువర్ణావకాశం.. రేపు హైటెక్ సిటీలో 70 కంపెనీల మెగా జాబ్ ఫెయిర్...

Hitech City Job fair 2024: నిరుద్యోగులకు శుభవార్త. నవంబర్ 19వ తేదీ మంగళవారం మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నారు. హైదర్‌బాద్ హైటెక్ సిటీలోని మాదాపూర్ 100 ఫీట్ రోడ్ మెరిడియన్ స్కూలు పక్కన ఉన్న శ్రీ సాయి గార్డెన్ ఫంక్షన్ హాల్‌లో ఈ జాబ్ మేళా నిర్వహిస్తారు.

ఆసక్తి ఉన్న అభ్యర్థులు సంబంధిత ధృవపత్రాలతో హాజరు కావచ్చు. ఈ జాయ్ ఫెయిర్ లో పదవ తరగతి నుంచి డిగ్రీ పాసైన వారు అర్హులు. అంతేకాదు ఈ మేళాలో ఫ్రెషర్స్‌తో పాటు అనుభవం ఉన్నవారు కూడా అర్హులు..

ఈ మెగా జాబ్ మేళాలో దాదాపు 70 కంపెనీలు పాల్గొంటాయి. ఎంపికైన అభ్యర్థులకు స్పాట్ ఆఫర్ లెట్టర్ కూడా ఇస్తారు. అయితే, జాబ్ ఫెయిర్‌కు హాజరు అయ్యే అభ్యర్థులు కొన్ని ధృవపత్రాలు తమతోపాటు తీసుకు రావాలి ఆ జాబితా ఇదే...
ఈ జాబ్ ఫెయిర్‌లో మీరు వర్క్ ఫ్రం హోం జాబ్స్ కూడా పొందవచ్చని ఆర్గనైజర్లు చెబుతున్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ మెగా జాబ్ మెళాలో మొదట పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఎంపికైన అభ్యర్థులకు అక్కడే స్పాట్ ఆఫర్ లెట్టర్ జారీ చేస్తారు.
జాబ్ ఫెయిర్‌కు హాజరు అయ్యే అభ్యర్థులు తమతోపాటు పది బయోడేటా ఫారమ్స్, కొన్ని పాస్ ఫోటోలు కూడా తీసుకువెళ్లాలి. నేరుగా 837431502 నంబర్‌లో ఇతర వివరాల కోసం సంప్రదించవచ్చు.