Home Business Ideas: రూ.10 వేలు ఉంటే చాలు.. లక్షలు సంపాదించే బిజినెస్ ఐడియా.. డోంట్ మిస్!
చాలామంది మహిళలకు వంటలు చేయడం ఎంతో ఇష్టం.. ఇందులో భాగంగానే పచ్చళ్ళ బిజినెస్ లోకి అడుగుపెడుతున్నారు. కొంతమంది మహిళలు అయితే లక్షల జీతాలను వదులుకొని మరి పచ్చళ్ళ వ్యాపారాలు పెడుతున్నారు. ముఖ్యంగా ఎంగేజ్ లో ఉండే యువత ఎక్కువగా ఇలాంటి బిజినెస్లను పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
పచ్చర్ల తయారీ ఖర్చు తక్కువే అయినప్పటికీ చాలామంది ఎక్కువ ధరల్లో విక్రయిస్తున్నారు. మరికొంతమంది అయితే సోషల్ మీడియాలో ప్రమోషన్స్ చేయించుకొని మరి బిజినెస్ ని ప్రమోట్ చేయించుకుంటున్నారు. దీని ద్వారా వేలలో ఉన్న పచ్చళ్ల బిజినెస్ లక్షలను సంపాదించి పెడుతున్నాయి.
భారతదేశంలో ప్రతి ఒక్కరు ఊరగాయను తప్పకుండా ఏదో ఒక క్రమంలో తీసుకుంటూ ఉంటారు. చాలామంది దీనిని దృష్టిలో పెట్టుకుని ఈ ఊరగాయల వ్యాపారాలను ప్రారంభిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ వ్యాపారాన్ని ప్రారంభించడానికి ముందుగా కేవలం రూ.10,000 పెట్టుబడిగా పెట్టాల్సి ఉంటుంది.
కేవలం నెలకు పదివేల రూపాయలు పెట్టుబడిగా పెట్టి చాలామంది లక్షల రూపాయలు సంపాదిస్తున్నారు. అయితే ఈ పచ్చల వ్యాపారాన్ని ఎంచుకునేవారు మార్కెట్లో ఏయే పచ్చళ్ళు ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారని అవగాహన తెలిసి ఉండాలి. అంతేకాకుండా దీనికి తోడు ప్రమోషన్ కూడా కీలక పాత్ర పోషిస్తుంది.
పచ్చళ్ళు పెట్టిన తర్వాత చాలామంది వాటిని ఎలా విక్రయించాలని ఆలోచిస్తూ ఉంటారు.. నిజానికి స్మార్ట్‌ఫోన్ వినియోగం పెరిగినప్పటి నుంచి చాలామంది ఎక్కువగా ప్రమోషన్స్ ద్వారా వారి బ్రాండ్ ప్రొడక్ట్స్ ను జనాలకు తెలిసేటట్లు చేస్తున్నారు. దీంతో వారు సులభంగా తమ వస్తువులను ఇతర ప్రొడక్ట్స్ ను విక్రయిస్తున్నారు. అయితే పచ్చళ్ళు పెట్టే వారు కూడా ఇదే పద్ధతిని అనుసరించడం వల్ల సులభంగా మార్కెట్లో మీ పచ్చళ్లను విక్రయించవచ్చు.
ఈ పచ్చళ్ళ బిజినెస్ లో భాగంగా ప్యాకింగ్ కూడా చాలా ఇంపార్టెంట్.. కస్టమర్ కి పంపే క్రమంలో చాలామంది నాణ్యతలేని ప్యాకింగ్ చేసి బ్రాండ్ దెబ్బ తీసుకుంటున్నారు. నిజానికి రెండు రూపాయలు ఎక్కువైనా సరే ప్యాకింగ్ లో రాజీ పడకూడదు. ఇలా చేస్తేనే మళ్లీమళ్లీ కస్టమర్స్ పికిల్స్ ని ఎక్కువగా కొనుగోలు చేస్తారు.