Activa Electric Launch: Honda నుంచి న్యూఇయర్ గుడ్ న్యూస్.. రూ. 90 వేలకే Activa Electric స్కూటీ..
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఇండియా మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో 2025లో భాగంగా లాంచ్ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా జనవరి 1వ తేదిన దీనికి సంబంధించిన బుకింగ్ ప్రక్రియను కూడా ప్రారంభించే ఛాన్స్‌లు కూడా ఉన్నట్లు సమాచారం. అయితే త్వరలోనే హెండా ఈ యాక్టివాకు సంబంధించిన అధికారక ప్రకటన కూడా విడుదల చేసే అవకాశాలు ఉన్నాయి.
అధికారిక సమాచారం ప్రకారం, Activa Electric స్కూటర్‌కి సంబంధించిన విక్రయాలు ఫిబ్రవరిలో ప్రారంభించే ఛాన్స్ ఉంది. ఇది మార్కెట్‌లోకి విడుదలైతే.. మార్కెట్‌లో అందుబాటులో ఉన్న Vida V2, బజాజ్ చేతక్ 2903, Ola S1 X ఎలక్ట్రిక్ స్కూటర్స్‌తో లాంచ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి.
ఈ Activa Electric స్కూటర్ వివిధ కలర్ ఆప్షన్స్‌లో విడుదల కానుంది. ఇది పెరల్ షాలో బ్లూ, పర్ల్ మిస్టీ వైట్‌తో పాటు మ్యాట్ ఫాగీ సిల్వర్ మెటాలిక్ కలర్ వేరియంట్స్‌లో లాంచ్ కానుంది. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్ 1.5kWh 2 పోర్టబుల్ బ్యాటరీ ప్యాక్‌తో అందుబాటులోకి రాబోతోంది.
అలాగే ఈ స్కూటర్ ఒక్కసారి ఛార్జ్ చేస్తే దాదాపు దాదాపు 102 కిమీ మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా 7.3 సెకన్లలో దాదాపు 0-60 kmph వేగాన్ని అందుకుంటుంది. దీంతో పాటు ఈ స్కూటర్ 8 hp శక్తితో పాటు 22 Nm టార్క్‌ను ఉత్పత్తి చేయబోతున్నట్ల కంపెనీ వెల్లడించింది. దీని బ్యాటరీ కేవలం 4 గంటల్లో 80 శాతం వరకు ఛార్జింగ్ ఫిల్ చేస్తుంది.
ఇక ఈ మోటర్ సైకిల్‌కి సంబంధించిన ధర వివరాల్లోకి వెళితే.. దీని ధర రూ. 90,000 (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా కంపెనీ ఈ స్కూటర్‌ను ఢిల్లీ, ముంబైతో పాటు బెంగళూరులలో మొదట విక్రయించబోతున్నట్లు తెలుస్తోంది.