Honda Sp 160 New Model 2025: దిమ్మతిరిగే ఫీచర్స్‌తో హోండా కొత్త బైక్.. ధర, ఫీచర్స్, స్పెషిఫికేషన్స్ వివరాలు ఇవే..
హోండా గతంలో విడుదల చేసిన SP160 మోడల్‌ను మరో సారి అప్‌డేట్ చేస్తూ విడుదల చేయబోతోంది. ఇది ప్రత్యేకమైన డిజైన్‌తో పాటు అనేక మార్పులతో రాబోతోంది. దీంతో పాటు అనేక కొత్త కలర్ ఆప్షన్స్‌లో లాంచ్ కాబోతున్నట్లు తెలుస్తోంది.
ఈ హోండా SP160 2025 మోటర్ సైకిల్ ఫ్రంట్ డిజైన్ చాలా అద్భుతంగా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా ఇది స్పోర్టి LED హెడ్‌ల్యాంప్స్‌తో విడుదల కాబోతున్నట్లు సమాచారం.. హోండా కంపెనీ ఈ బైక్‌లో 4.2-అంగుళాల TFT డిస్ప్లేతో విడుదల చేసింది.
హోండా SP160 2025 బైక్ అద్భుతమైన బ్లూటూత్ కనెక్టివిటీతో అందుబాటులోకి రానుంది. అంతేకాకుండా ఇందులో హోండా రోడ్‌సింక్ యాప్ సపోర్ట్ ఫీచర్‌ను కూడా అందిస్తోంది. ఈ డిస్ప్లేలో టర్న్-బై-టర్న్ నావిగేషన్ సపోర్ట్ కూడా లభిస్తోంది.
ఈ బైక్‌లో మ్యూజిక్ ప్లేబ్యాక్ కంట్రోల్ సిస్టమ్‌తో పాటు కాల్‌తో పాటు SMS అలర్ట్‌ల ఫీచర్స్‌ను కూడా కలిగి ఉంటుంది. దీంతో పాటు టైప్-సి USB ఛార్జింగ్ పోర్ట్‌ను కూడా అందుబాటులోకి తీసుకు రాబోతోంది. ఇవే కాకుండా చాలా రకాల ఫీచర్స్ కూడా అందుబాటులో ఉన్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ మోటర్ సైకిల్ హోండా 162.71cc ఎయిర్-కూల్డ్ ఇంజన్‌తో విడుదల కానుంది. అలాగే ఇది 5-స్పీడ్ గేర్‌బాక్స్ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. దీంతో పాటు 14.8Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇక దీని ధర రూ. 1,21,951 నుంచి రాబోతోంది.