Nita Ambani: ముఖేష్ అంబానీ జీతం సున్నా..నీతా అంబానీ వారి పిల్లల జీతం ఎంతో తెలుస్తే షాక్ అవుతారు

Sat, 17 Aug 2024-8:35 pm,

Anant Ambani Income:మన దేశంలో సంపన్న కుటుంబమైన అంబానీ ఫ్యామిలీ అంటే ఎప్పుడు వార్తల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలుస్తూ ఉంటుంది.  ఇటీవలి వారి కుటుంబంలో ముకేశ్ అంబానీ చిన్న కుమారుడు అనంత అంబానీ వివాహం జరిగింది. . ఈ వివాహం గురించి ప్రపంచమంతా చర్చించుకుంది.  ఆసియాలోనే అత్యంత సంపన్న కుటుంబం అయినా అంబానీ ఫ్యామిలీ గురించి ఏ వార్త వచ్చినా అది ప్రధాన వార్తగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.  తాజాగా వారి కుటుంబానికి సంబంధించిన ఆదాయం గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి అవేంటో తెలుసుకుందాం.

ఫోర్బ్స్ ప్రకారం ఆసియాలో అత్యంత సంపన్న కుటుంబమైన అంబానీ కుటుంబం మొత్తం సంపద 113.5 బిలియన్ డాలర్లుగా ఉందని. అంబానీ కుటుంబానికి రిలయన్స్ ఇండస్ట్రీస్‌లో 50.33% వాటాలు ఉన్నాయి. వీరి కుటుంబం కంపెనీ నుంచి  భారీగా డివిడెండ్‌ల రూపంలో ఆదాయం పొందుతుంది. 2023-24 సంవత్సరంలోనే రూ.3322.7 కోట్ల డివిడెండ్ అందుకుంది.   

ముఖేష్ అంబానీ జీతం ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్, ఎండీ ముఖేష్ అంబానీ వేతనం విషయానికి వస్తే, గత నాలుగేళ్లుగా కంపెనీ నుంచి ఎలాంటి జీతం తీసుకోలేదు. కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. వ్యాపార పర్యటనల సమయంలో అతని భార్యతో పాటు, ఇతర  సహచరులకు ప్రయాణం, బోర్డింగ్,  లాడ్జింగ్ ఖర్చుల రీయింబర్స్‌మెంట్‌కు ముఖేష్ అంబానీ అర్హత కలిగి ఉంటాడని గత సంవత్సరం వాటాదారుల ఆమోదం కోరుతూ కంపెనీ  ఒక ప్రత్యేక తీర్మానం  చేసింది. కంపెనీ వ్యాపార ఖర్చుల నుంచే ఇంటికి కమ్యూనికేషన్ బిల్స్, ఉపయోగించే కారు ఖర్చులు కూడా కంపెనీ చెల్లిస్తుంది. అంబానీ అతని కుటుంబ సభ్యుల కోసం రిలయన్స్  కంపెనీ భద్రతను ఏర్పాటు కల్పిస్తుంంది. ఇందుకోసం కంపెనీ చేసే ఖర్చును వారికి చెల్లించే వేతనంలో భాగం కాదు. 

నీతా అంబానీ ఎంత సంపాదించింది? నీతా అంబానీ ఆగస్టు 2023 వరకు రిలయన్స్ ఇండస్ట్రీస్ బోర్డులో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పని చేస్తున్నారు. 2023-24 ఆర్థిక సంవత్సరంలో నీతా అంబానీ సిట్టింగ్ ఫీజుగా రూ. 2 లక్షలు  కమీషన్‌గా రూ. 97 లక్షలు సంపాదించారు.

అంబానీ పిల్లల ఆదాయం ఇదే: ఆకాష్ అంబానీ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ చైర్మన్. ఇషా అంబానీ రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్  రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ బోర్డులో ఉన్నారు  రిలయన్స్ ఫౌండేషన్‌తో విస్తృతంగా పని చేస్తున్నారు.   

అనంత్ అంబానీ జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్, రిలయన్స్ రిటైల్ వెంచర్స్ లిమిటెడ్, రిలయన్స్ న్యూ ఎనర్జీ లిమిటెడ్  రిలయన్స్ న్యూ సోలార్ ఎనర్జీ లిమిటెడ్‌లలో డైరెక్టర్‌గా ఉన్నారు.   

ముఖేష్ అంబానీ పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ , ఆకాష్ అంబానీ నికర విలువ 40.1 బిలియన్ డాలర్లుగా ఉంది.  

 ఇషా అంబానీ సంపాదన 100 మిలియన్ డాలర్లు (రూ. 831 కోట్లు)గా అంచనా వేశారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link