Passport: పాస్‌పోర్ట్ ఎలా అప్లై చేయాలి..కేవలం గంటలోనే..
కేవలం పదిహేను రోజుల్లోపలే పాస్‌పోర్ట్ మీ ఇంటికి వచ్చేస్తుంది. రెన్యువల్‌కు కూడా ఇదే ప్రక్రియ.
పాన్ కార్డు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదా ఓటరు ఐడీ కార్డు సమర్పించాల్సి ఉంటుంది. విద్యార్హతల జిరాక్స్ కాపీల్ని సమర్పిస్తూ..ఒరిజినల్స్ మాత్రం చూపించాలి.
పుట్టిన తేదీ ధృవీకరణ కోసం పదవ తరగతి మార్క్స్ లిస్ట్ లేదా సంబంధిత శాఖ నుంచి ధృవీకరణ పత్రం సమర్పించాలి.
అడ్రస్ ప్రూఫ్ కోసం ఆధార్ కార్డు లేదా గ్యాస్ కనెక్షన్ ప్రూఫ్ లేదా టెలిఫోన్ బిల్ లేదా వాటర్ బిల్ లేదా రెంటల్ అగ్రిమెంట్ ఏదైనా సమర్పించవచ్చు.
తరువాత స్లాట్ బుక్ అయిన తేదీ, సమయానికి మీ సమీపంలోని పాస్‌పోర్ట్ ఆఫీసు లేదా పోస్టాఫీసులో ఏర్పాటు చేసిన పాస్‌పోర్ట్ కేంద్రానికి వెళ్లి..సంబంధిత పత్రాలు సమర్పించాలి. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేయాలి. మీరు బుక్ చేసుకున్న టైమ్ నుంచి గంటలో ఈ ప్రక్రియ పూర్తయిపోతుంది.
ముందుగా ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకోవల్సి ఉంటుంది. మొబైల్ నుంచి లేదా ఏదైనా నెట్ సెంటర్‌కు వెళ్లి సింపుల్‌గా బుక్ చేసుకోవచ్చు.