EPFO: UANలో మీరు తప్పుగా పడిందా? పేరు మార్చాలా? అయితే ఈ మూడు డాక్యుమెంట్లు ఉంటే సింపుల్ గా మార్చుకోవచ్చు

Fri, 03 Jan 2025-6:42 pm,

EPFO: మీరు ఈపీఎఫ్ఓ చందాదారులా. మీ పీఎఫ్ యూనివర్సల్ అకౌంట్ నెంబర్ యూఏఎన్ పేరుతో తప్పుగా పడిందా. అయితే ఇలాంటి వివరాలను మీరు చాలా ఈజీగా మార్చుకునే సదుపాయాన్ని తీసుకువచ్చింది ఈపీఎఫ్ఓ. అంతేకాదు కొత్త మార్పులకు అవసరమయ్యే డాక్యుమెంట్ల జాబితాను కూడా పొందుపరిచింది. ఈ మేరకు ఈఫీఎఫ్ఓ ఎక్స్ లో ఓ పోస్టును షేర్ చేసింది. యూఏఎన్ లో పేరుతోపాటు తదితర మార్పులకు కనీసం మూడు డాక్యుమెంట్లు కచ్చితంగా ఉండాలని పేర్కొంది. అందులో ఆధార్ కార్డు తప్పనిసరని పేర్కొంది.   

యూఏఎన్ పై పేరు మార్పు రెండు అక్షరాల  కంటే ఎక్కువ ఉన్నా..రెండు అక్షరాల కంటే తక్కువగా ఉన్నా ఫొనెటికల్ గా పేరు మార్చడానికి ఈ కింది డాక్యుమెంట్లు అవసరం అవుతాయి. 

యూఏఎన్​ పై  పేరు మార్పునకు కావాల్సిన డాక్యుమెంట్లు ఇవే: 

ఆధార్ (తప్పనిసరి), పాస్​పోర్ట్, మరణ ధృవీకరణ పత్రం, జనన ధృవీకరణ పత్రం, డ్రైవింగ్ లైసెన్స్, కేంద్ర ప్రభుత్వం/రాష్ట్ర ప్రభుత్వం/కేంద్ర పాలిత ప్రాంతం/PSU/బ్యాంకులు జారీ చేసిన సర్వీస్​ ఫొటో గుర్తింపు కార్డు, బ్యాంక్ అధికారి పేరు, ఫొటోపై క్రాస్ స్టాంప్ చేసిన బ్యాంక్ పాస్ బుక్, పాన్ కార్డ్/ఇ-పాన్, రేషన్/PDS ఫొటో కార్డ్, ఓటరు గుర్తింపు కార్డు/ఇ-ఓటర్ గుర్తింపు కార్డు, పెన్షనర్ ఫొటో కార్డ్/ఫ్రీడం ఫైటర్ ఫొటో కార్డ్   

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పీఎస్ యూ, రాష్ట్రీయ స్వాస్థ్య బీమా యోజన కార్డు జారీ చేసిన ఫొటోతో కూడిన సీజీహెచ్ఎస్, ఈసీహెచ్ఎస్ మెడి క్లెయిమ్ కార్డు, ఫొటోతో కూడిన ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ సర్టిఫికేట్, పూర్తి పేరు, మొదటి పేరు మార్పు అభ్యర్థనల కోసం పీఎఫ్ సభ్యుడు కొత్త పేరు గెజిట్ నోటిఫికేషన్ తోపాటు పాత పేరుతో ఉన్న ఏదైనా సపోర్టింగ్ డాక్యుమెంట్ ను ఫొటోతో పాటు సమర్పించాల్సి ఉంటుంది. 

ఇతర విదేశీ జాతీయుల విషయంలో,విదేశీ పాస్ పోర్టుతో పాటు చెల్లుబాటు అయ్యే వీసా ఉండాలి. ఫోటో ఉన్న స్వాతంత్ర్య సమరయోధుడి కార్డు, భారత ప్రభుత్వం జారీ చేసిన పర్సన్ ఆఫ్ ఇండియన్ ఓరిజిన్ కార్డ్ కాపీ, భారత ప్రభుత్వం జారీ చేసిన ఓవర్సీస్ సిటిజెన్ ఆఫ్ ఇండియా కార్డ్, 19. టిబెటన్ శరణార్థి కార్డు కాపీలు తప్పనిసరిగా ఉండాలి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link