Tulsi Water Benefits: తులసి నీటిని ఇలా తీసుకుంటే..ఈ రోగాలన్నీ మాయమే
ఉదయాన్నే తులసి నీరు తాగడం వలన జ్వరం, వైరల్ ఫీవర్స్ దరిచేరవు. మలబద్ధకం, విరేచనాల సమస్యను నుంచి ఉపశమనం లభిస్తుంది.
మధుమేహ వ్యాధిగ్రస్తులు కూడా తులసి నీరు తాగవచ్చు. దీనివలన బాడీలో షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. శరీరంలోని విషపదార్థాలు బయటకు వస్తాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కొబ్బరి నీళ్లు, తులసి ఆకులు, నిమ్మరసం కలిపి తాగితే కడుపు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది. కడుపులో ఎసిడిటి ఉన్నవారు ప్రతి రోజూ రెండు నుంచి మూడు తులసి ఆకులను తినాలి. అలాగే పొద్దున్నే తులసి నీరు తాగడం వల్ల సీజనల్ ఇన్ఫెక్షన్స్‌కు చెక్ పెట్టవచ్చు.
జలుబు, దగ్గు, జీర్ణ సంబంధిత సమస్యల నుంచి తులసి ఉపశమనం కల్పిస్తుంది. వర్షాకాలంలో పసుపు, తులసి కషాయం తీసుకోవడం వలన రోగ నిరోధక శక్తి పెరగడమే కాకుండా..గొంతులో గరగర, గొంతు నొప్పి.. ఇతర సమస్యలు దూరమవుతాయి.
ప్రతిరోజూ తులసి నీటిని ఉదయాన్నే ఖాళీ కడుపుతో తీసుకోవడం వలన చాలా ప్రయోజనాలుంటాయి. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. అలాగే బరువు తగ్గడంలో సహయపడుతుంది. కొలెస్ట్రాల్‌కు చెక్ పెట్టవచ్చు.