How To Control Sugar: మధుమేహం ఉన్నవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఆహార నియమాలు..
గోధుమ పిండితో తయారు చేసిన ఆహార పదార్థాలు ప్రతి రోజు ఆహారంలో తీసుకోవడం వల్ల సులభంగా రక్తంలో చక్కెర పరిమాణాలను నియంత్రించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇందులో ఉండే గుణాలు శరీర బరువును కూడా నియంత్రిస్తుంది. మధుమేహంతో బాధపడుతున్నవారు బరువు పెరిగితే తప్పకుండా గోధుమ పిండితో తయారు చేసి రోటీలను ప్రతి రోజు తినాల్సి ఉంటుంది.
మధుమేహం ఉన్నవారు చాలా మంది తరచుగా తీవ్ర అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. అనారోగ్య సమస్యలు రాకుండా ఉండడానికి తప్పకుండా వ్యాయామాలు, యోగా చేయాలని నిపుణులు నిపుణులు సూచిస్తున్నారు.
మధుమేహంతో బాధపడేవారు తప్పకుండా డైట్‌లో ఓట్స్‌మీల్ తప్పనిసరిగా తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. కాబట్టి ఇందులో ఉండే ఫైబర్ శరీర బరువును నియంత్రించడమేకాకుండా..రక్తంలో చక్కెర పరిమాణాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
మధుమేహంతో బాధపడుతున్నవారు తప్పకుండా ఆరోగ్య నిపుణులు సూచించిన పలు చిట్కాలు పాటించాల్సి ఉంటుంది. ఈ వ్యాధిన బారిన పడ్డవారు రోజు తీనే ఆహారాలో తప్పకుండా ఫైబర్ అధిక పరిమాణంలో ఉండే ఆహారాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఉండే గుణాలు రక్తంలో చక్కెర పరిమాణాలు నియంత్రణలో ఉంచేందుకు సహాయపడతాయి.
శరీరంలో ప్యాంక్రియాస్ ఇన్సులిన్‌ను ఉత్పత్తులు పడిపోయినప్పుడు శరీరంలో డయాబెటీస్ పెరుగుతుందని..దీని కారణంగా కొందరిలో రక్తంలో చక్కెర పరిమాణాలు పెరుగుతాయని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు. ఇలా పెరగడం వల్ల చాలా మందిలో గుండెపోటు సమస్యలు వస్తున్నాయి.