Paytm new feature: పర్సనల్ లోన్ కావాలా..రెండు నిమిషాల్లోనే..ఎలా అప్లై చేయాలంటే

Wed, 06 Jan 2021-6:02 pm,

లోన్ తీసుకోవాలనుకునే కస్టమర్..పేటీఎం యాప్ ( Paytm app ) లో ఫైనాన్షియల్ సర్వీస్ సెక్షన్ లోకి వెళ్లాలి. తరువాత పర్సనల్ లోన్ పై క్లిక్ చేసి..తరువాత ఇచ్చే వివరాలు నమోదు చేయాలి. 

పేటీఎం ( Paytm ) నుంచి మీరు కేవలం 2 నిమిషాల్లోనే లోన్ తీసుకోవచ్చు. దీన్ని మీరు 18 నుంచి 36 నెలల్లోగా ఈఎంఈ పద్దతిలో చెల్లించవచ్చు. తమ కలల్ని సాకారం చేసుకునేవారి కోసం ఈ సౌకర్యాన్ని ప్రవేశపెట్టామని పేటీఎం చెబుతోంది. తాత్కాలిక అవసరాలు పూర్తి చేసుకునేలా షార్ట్ టైమ్ లోన్ కోసం ఈ సౌకర్యం ఉపయోగపడుతుంది.

పేటీఎం లెండింగ్ ( Paytm lending ) సౌకర్యం  ద్వారా మీరు  24 గంటలూ, వీకెండ్‌లోనూ, పబ్లిక్ హాలిడేస్‌లోనూ లోన్ తీసుకోవచ్చు. పేటీఎం ఈ సౌకర్యం శాలరీ హోల్డర్స్, చిరు వ్యాపారులకు, ప్రొఫెషనల్స్ కోసం లాంచ్ చేసింది. చిన్నపట్టణాల్లో ఉండి పెద్ద బ్యాంకుల్నించి లోన్ తీసుకోలేని వారికి ఈ సౌకర్యం బాగా ఉపయోగపడుతుంది. 

పేటీఎం లెండింగ్ ( Paytm lending ) ఫీచర్ ద్వారా ఎవరైనా సరే పర్సనల్ లోన్ కోసం అప్లై చేయవచ్చు. భాగస్వామ్య బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీలు మీకోసం కేవలం 2 నిమిషాల్లోనే లోన్ ప్రక్రియ ప్రారంభించేస్తాయి. ఈ కొత్త ఫీచర్ ద్వారా 2021 మార్చ్ నాటికి పది లక్షల మంది వినియోగదార్లను జోడించడమే పేటీఎం లక్ష్యంగా పెట్టుకుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link