Weight Control Tips: తక్కువ తింటూనే బరువు తగ్గించుకునే అద్భుతమైన మార్గాలివే

తక్కువ తినడం వల్ల సహజంగానే బరువు తగ్గుతారు. ఇది కాస్తా జీవన కాలంపై ప్రభావం చూపిస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం నిర్ణీత మోతాదులో తిండి తినడం వల్ల ఎలుకలు ఎక్కువ కాలం జీవించాయి. ఆ తరువాత 2023లో 200 మందిని రెండేళ్లపాటు డైట్‌లో 12 శాతం తగ్గించి ఇవ్వగా వృద్ధాప్యం ఛాయలు తగ్గినట్టు తేలింది.

తక్కువ కేలరీలు ఉన్న ఆహారం తిన్నా సరే కడుపు నిండుగా ఉండేట్టు ఎలా చేయాలనే అంశంపై ఓ నివేదిక కూడా ప్రచురితమైంది. అందులో అన్నీ వివరంగా ఉన్నాయి.

భోజనం ఎంత తిన్నామనేది తృప్తిని బట్టి కూడా ఉంటుంది. తినే ఆహారం పెద్ద ప్లేట్ కాకుండా చిన్న ప్లేట్‌లో తినడం అలవాటు చేసుకోవాలి. ఇది కచ్చితంగా ఫలితం చూపిస్తుంది
స్నేహితులు లేదా బంధువులతో కలిసి డిన్నర్‌కు వెళ్లినప్పుడు ఫ్రైడ్ పదార్ధాలను ఇష్టపడుతుంటాం. రోజూ ఎంత తినాలో అంత తినకుండా కడుపు నిండేవరకూ తినే కోరిక కలిగి ఉంటుంటారు.. ఇది మంచిది కాదు.
భోజనం లేదా టిఫిన్ చేసేముందు ఓ గ్లాసు నీళ్లు తప్పకుండా తాగాలి. భోజనానికి ముందు నీళ్లు తాగడం వల్ల కడుపు త్వరగా నిండుతుంది. దాంతో సహజంగానే భోజనం తక్కువ తీసుకుంటారు
తినే ఆహారంలో పైబర్ ఎక్కువగా ఉండేట్టు చూసుకోవాలి. ఫైబర్ అధికంగా ఉండే ఆహారం తినడం వల్ల కడుపు నిండినట్టు ఉంటుంది. షుగర్ లెస్ గమ్ నమలడం అలవాటు చేసుకోండి. కూరగాయలు ఎక్కువగా తినడం మంచిది.
స్వీట్స్, కేక్స్, క్రిస్పీ, బిస్కట్స్ వంటివి సాధ్యమైనంత వరకూ దూరం చేయాలి. వీటి వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా పెరుగుతాయి. దాంతో ఆకలి త్వరగా వేస్తుంది