Vada with Idli: ఉదయాన్నే మిగిలిపోయిన ఇడ్లీలతో సాయంత్రం వేడి వేడి వడలు ఎలా చేసుకోవాలంటే..!
ఎంతోమంది ఇళ్లల్లో ఉదయాన్నే చేసిన ఇడ్లీలు మిగిలిపోవడం.. రోజు జరిగే పనే. మరి అలా మిగిలిపోయిన ఇడ్లీలతో సాయంత్రం పట కరకర నోరూరించే వడలు ఎలా చేసుకోవాలో చూద్దాం…
ముందుగా రెండు ఉల్లిపాయలను, కొంచెం అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకులు, కొత్తిమీర అన్నింటిని సన్నగా తరిగి పెట్టుకోండి.
ఇప్పుడు మిగిలిపోయిన ఒక నాలుగు ఇడ్లీలను బాగా పొడిపొడిగా చేసుకొని.. అందులోనే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం తరుగు, అరకప్పు బియ్యప్పిండి వేసుకొద్దిగా
అందులోనే కొద్దిగా.. కొత్తిమీర తరుగు, మిరియాల పొడి, జీలకర్ర, అరకప్పు ఉప్మా రవ్వ.. రుచికి సరిపడా ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి.
ఇలా చేసి పెట్టుకున్న మిశ్రమంలో కొద్ది కొద్దిగా నీళ్లు పోస్తూ.. వడపిండి లాగా కలుపుకోవాలి.
ఆ తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె వేసుకొని..నూనె వేడెక్కాక.. పిండి ముద్దను తీసి గారెల్లా ఒత్తుకొని.. నూనెలో వేసుకొని రెండు వైపులా బాగా కాల్.
అంటే ఎంతో క్రంచిగా ఉందే రుచికరమైన వడలు రెడీ.