Tomato: వర్షాకాలంలో టమాట ధరలు మరింత పెరిగేలోపు ఈ ఒక్క పని చేయండి.. రేటు పెరిగినా కంగారు పడాల్సిన పనిలేదు..
టమాటాలు మనం నిత్యం ఇంట్లో వినియోగించే కూరగాయ. అందుకే ఏ కూరగాయలు ఇంట్లో అందుబాటులో లేకున్నా సామాన్యులు టమాటాలు, ఉల్లిపాయలు ఉంటే చాలు. కూర రెడీ అయిపోతుంది. పెరుగుతున్న టమాటాలు గుండెల్లో గుబులు పెడుతున్నాయి.
టమాటాలు ఇంకా రేటు పెరగక ముందే కొనుగోలు చేసి రకరకాలుగా నిల్వ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల ఎక్కువ కాలం పాటు నిల్వ ఉంటాయి. మార్కెట్లో రేటు పెరిగినా ఫర్వాలేదు. టమాటాలు కట్ చేసి ఎయిర్ ఫ్రైయర్‌లో ఆరబెట్టి నిల్వ చేసుకోవచ్చు.
టమాటాలు ఎక్కువ కాలం నిల్వ చేసుకోవడానికి మరో విధానం వాటిని కట్ చేసి జిప్ లాక్ బ్యాగుల్లో స్టోర్ చేయాలి. దీనికి జిప్ లాక్ బ్యాగులు అవసరం ఉంటుంది. టమాటాను శుభ్రంగా కడిగి నీరు లేకుండా తుడవాలి. ఆ తర్వాత జిప్ లాక్ బ్యాగులో వేసి గాలి లేకుండా లాక్ చేసి ఫ్రీజర్‌లో నిల్వ చేయాలి.
టమాటాలు నిల్వ చేయడానికి మరో విధానం వాటిని కట్ చేసి నూనెలో వేయించుకోవాలి. పూర్తిగా నీరు లేకుండా ఉడికించుకోవాలి. ఆ తర్వాత ఓ గాజు సీసాలో వేసి ఫ్రీజ్‌లో పెట్టి నిల్వ చేసుకోవచ్చు.
టమాటాలకు బదులుగా కొన్ని ఇతర ఆహార పదార్థాలు కూడా ఉంటాయి. వాటిని కూడా కూరల్లో వేసుకోవచ్చు. ముఖ్యంగా పెరుగు కూడా పుల్లని రుచి కలిగి ఉంటుంది. ఇది వేసినా టమాట రుచి వస్తుంది.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )