Raja Saab: ప్రభాస్ రెమ్యూనరేషన్ విషయంలో పెద్ద ట్విస్ట్.. రాజా సాబ్ కి తీసుకునేది ఎంతో తెలుసా?
బాహుబలి సినిమాతో తెలుగు ఇండస్ట్రీని ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసిన ఘనత ప్రభాస్ కే దక్కింది. ఒకే ఒక్క సినిమాని నమ్మి కెరియర్ పీక్లో ఉన్నప్పుడు ఐదేళ్లు రాజమౌళి ఖాతా లో వేసేసిన ప్రభాస్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ గా మారిపోయారు. వరుసగా పాన్ ఇండియా సినిమా చేస్తూ ఒక బ్లాక్ బస్టర్ తర్వాత మరొక బ్లాక్ బస్టర్ అందుకుంటూ.. ప్రభాస్ కెరియర్లో అద్భుతంగా ముందుకు దూసుకు వెళుతున్నారు.
మిగతా స్టార్ హీరోలలాగా కాకుండా ప్రభాస్ సంవత్సరానికి ఒకటి లేదా రెండు సినిమాలను విడుదల చేయడానికి అన్నీ విధాలుగా ప్రయత్నిస్తున్నారు. ఈ రకంగా ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడంలో ముందు ఉండే ప్రభాస్ ఒక్కో సినిమాకి దాదాపు 150 కోట్ల దాకా రెమ్యూనరేషన్ తీసుకుంటారు. ప్రభాస్ మార్కెట్ కూడా అంతే పెద్దగా ఉంటుంది కాబట్టి.. నిర్మాతలు కూడా భారీ రెమ్యూనరేషన్ ఇవ్వడానికి రెడీగా ఉంటారు.
కానీ తాజాగా రాజా సాబ్ సినిమా విషయంలో మాత్రం ప్రభాస్ రెమ్యూనరేషన్ లో ఒక ట్విస్ట్ ఉందని తెలుస్తోంది. ఒక్కో సినిమాకి 150 కోట్ల చొప్పున రెమ్యూనరేషన్ తీసుకునే ప్రభాస్ ఈ సినిమా కోసం కేవలం 100 కోట్లు మాత్రమే తీసుకుంటున్నారట. రాజా సాబ్ సినిమాని నిర్మిస్తున్నది పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వారు. గతంలో ప్రభాస్ నటించిన ఆది పురుష్ సినిమాకి కూడా వీళ్లే నిర్మాతలుగా వ్యవహరించారు.
ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ సినిమాతో నిర్మాతలకి భారీ నష్టాలు వాటిల్లాయి. అందుకే ఇప్పుడు ప్రభాస్ రాజా సాబ్ సినిమా విషయంలో నిర్మాతల కోసం రెమ్యూనరేషన్ తగ్గించుకున్నట్లు తెలుస్తోంది.
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం బోలెడు ఆసక్తికరమైన ప్రాజెక్టులు ఉన్న సంగతి తెలిసిందే. ఈ మధ్యనే ప్రభాస్ హీరోగా నటించిన కల్కి 2894 ఏడీ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఈ సినిమాకి సీక్వెల్ తో పాటు, సాలార్ 2, ఫౌజి, స్పిరిట్ వంటి మరికొన్ని భారీ బడ్జెట్ సినిమాలతో ప్రభాస్ బిజీగా ఉన్నారు.