Laad Bazar Lac Bangles:హైదరాబాద్ నగరానికి మరో అరుదైన గౌరవం.. లాడ్ బజార్ లక్కగాజులకు జీఐ నగిషీ..
భాగ్యనగరం సిగలో మరో మణిహరం వచ్చి చేరింది. ఇప్పటికే హైదరాబాద్ నగరం అనేక టూరిస్టు ప్రదేశాలకు, ఫుడ్ ఐటమ్స్ కు ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడ దొరికే బిరియాని, హలీమ్ లు ఎంతో ఫెమసో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.
ఇక్కడ అనేక పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి. టూరిస్టులు ఎక్కడి నుంచి వచ్చిన తొలుత చార్మినార్ కు వెళ్లి అక్కడి షాపింగ్ చేయందే వేరే పని ముట్టుకోరు. ఇక పెళ్లికి రెడీ అవుతున్న వాళ్లంతా తప్పకుంబా చార్మినార్ లోని లాడ్ బజార్ కు వెళ్తుంటారు.
చార్మినార్ చుట్టుపక్కల అమ్మాయిలు ఉపయోగించే ముత్యాల హరాలు, లక్కగాజులు, లాంగ్ చైన్స్, వెరైటీ బ్యాంగిల్స్ అన్ని దొరుకుతాయి. ఇక్కడ పెళ్లి షాపింగ్ లు ఎక్కువగా చేస్తుంటారు. తాజాగా, లాడ్ బజార్ లో దొరికే లక్క గాజులకు జీఐ గుర్తింపు లభించింది.
ఇక్కడ దొరికే లక్క గాజులకు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయంగా కూడా ఎంతో ప్రసిద్ది చెందిందని చెప్పవచ్చు. ఈ గాజులను ఎంతో కష్టపడి తయారు చేస్తుంటారు. రెసిన్ ను నిప్పుల కొలిమిపై కరిగిస్తారు. ఆ తర్వాత చేతులతోనే హస్తకాళాకారులు అనేక డిజైన్ లను తయారు చేస్తారు.
లాడ్ బజారు లో దొరికే లక్క గాజులకు జీఐ గుర్తింపును ఇవ్వాలని 2022 లో క్రిసెంట్ హ్యాండీ క్రాఫ్ట్ ఆర్టిజన్స్ వెల్ఫెల్ అసోసియేషన్ దరఖాస్తు చేసుకుంది. దీని కోసం తెలంగాణ ఇండస్ట్రీస్, కమర్శియల్ డిపార్ట్ మెంట్ తన వంతు ప్రొత్సాహం అందించింది.
లాడ్ బజార్ లో దొరికే లక్కగాజులకు అరుదైన గౌరవం లభించడం పట్ల వ్యాపారులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వేలాది మంది ఈ బిజినెస్ మీద ఆధారపడి ప్రతిరోజు దేశ, విదేశాలకు లక్క గాజులను ఎక్స్ పోర్టు చేస్తున్నట్లు సమాచారం.