Heavy Rainfall: మండుటెండలో చల్లని కబురు.. ఈదురు గాలులతో మోస్తరు నుంచి భారీ వర్షాలు..

Sun, 05 May 2024-2:52 pm,

తెలంగాణకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం చల్లని కబురు చెప్పింది. కొన్నిరోజులుగా ఎండలు ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.ఇప్పటికే అనేక ప్రాంతాలలో ఉష్ణోగ్రతలు 47 డిగ్రీలను దాటేశాయి. ఇక వడదెబ్బ ప్రభావం వల్ల 20 మంది వరకు చనిపోయినట్లు తెలుస్తోంది.  

ఎండల ప్రభావం వల్ల ప్రజలు అత్యవసమైతేనే బైటకు వెళ్లాలని నిపుణులు సూచిస్తున్నారు. బైటకు వెళ్లాల్సి వస్తే, ఎక్కువగా నీళ్లు తాగాలి. వదులుగా ఉండే దుస్తులు ధరించాలి. దాహాంవేయకున్న కూడా నీళ్లను, ఫ్రూట్ జ్యూస్ లు ఎక్కువగా తాగాలని కూడా నిపుణులు చెబుతున్నారు.   

ఈ క్రమంలో ఎండలతో అల్లాడిపోతున్న ప్రజలకు హైదరాబాద్ వాతావరణ కేంద్ర గుడ్ న్యూస్ చెప్పింది.  మరాట్వాడ, పరిసర ప్రాంతాలలో సగటు సముద్ర మట్టానికి 1.5 కి. మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉందని తెలిపింది. దీనిప్రభావంతో వాతావరణం ఒక్కసారిగా చల్లబడుతుందని ఐఎండీ పేర్కొంది.

తెలంగాణ రాష్ట్రంలో దక్షిణ, ఆగ్నేయ దిశల నుండి బలమైన గాలులు వీస్తున్నాయి. దీని ప్రభావం వల్ల తెలంగాణలో రాగల 3 రోజుల  తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. అదే విధంగా మరికొన్నిచోట్ల  మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురిసే అవకాశం ఉందని సమాచారం.   

అదే విధంగా.. రేపు  రాష్ట్రంలో కొన్ని జిల్లాల్లో అక్కడ అక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉంది. ఎల్లుండి మాత్రం..  తెలంగాణ రాష్ట్రంలో కొన్ని జిల్లాలలో ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30 - 40 కి. మీ వేగంతో వీచే ఈదురుగాలతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కురుస్తాయని  హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link