Drunk And Drive Test: మందుబాబులకు బిగ్ షాక్.. ఇక మీదట నెహ్రూ ఔటర్ రింగ్ రోడ్లలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు..
ప్రస్తుతం రోడ్డు మీద ఎక్కడ చూసిన వాహానాల ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. వీటిలో ఎక్కువగా తాగి వాహానాలు నడపడం వల్ల జరుగుతున్నట్లు తెలుస్తొంది.
చాలా మంది తప్పతాగి ఇష్టమున్నట్లు డ్రైవింగ్ చేస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని జాగ్రత్తలు చెప్పిన, చాలాన్ లు విధించిన కూడా మందుబాబుల తీరులో మాత్రం మార్పులు రావడం లేదు.
తరచుగా రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. ముఖ్యంగా వీకెండ్ వచ్చిందంటే చాలు... మందుబాబులు రెచ్చిపోతుంటారు. దీంతో పోలీసులు కూడా వీకెండ్ వచ్చిందంటే స్పెషల్ డ్రైవ్ లు చేపట్టి మరీ మందుబాబులకు చుక్కలు చూపిస్తుంటారు.
ఈ క్రమంలో మందుబాబులు బ్రీత్ అనలైజ్ చేసి వారికి మోతాదుకు మించి తాగినట్లైతే జరిమానాలు విధించి, జైలుకు సైతం పంపుతున్నారు. ఈ క్రమంలో హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తొంది.
ఇక మీదట హైదరబాద్ లోని నెహ్రూ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తామని తెలిపారు. ఎవరైన తప్పతాగి వాహానాలు నడిపితే.. అరెస్టులు కూడా ఉంటాయని స్పష్టం చేశారు. ఇటీవల నెహ్రు అవుటర్ రింగ్ రోడ్డు వద్ద రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్న విషయం తెలిసిందే.