Hyundai Exter: ఆ ఐదు ప్రత్యేకతలే టాటా పంచ్ కంటే హ్యుండయ్ ఎక్స్‌టర్‌ను ముందు నిలబెట్టింది, ధర ఎంతంటే
ఎక్స్‌టర్‌ను 7 వేరియంట్లలో ప్రవేశపెట్టింది హ్యుండయ్ కంపెనీ. అవి వరుసగా హ్యుండయ్ EX, EX(O), S, S(O), SX, SX(O),SX(O). ఎక్స్‌టర్ ధర 5.99 లక్షల నుంచి ప్రారంభం కానుంది. 10 లక్షల వరకూ ఉంటుంది.
ఎక్స్‌టర్‌ను గ్రాండ్ ఐ 10 నియోస్, ఆరాతో పోలిస్తే సమానమైన సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.
ఎక్స్‌టర్ ఈ విభాగంలో తొలిసారిగా ఫుట్‌వెల్ లైటింగ్, మెటల్ పెడల్, షార్క్ పిన్ యాంటినా, స్మార్ట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, డ్యూయల్ కెమేరా, వైర్‌లెస్ ఛార్జర్, రేర్ ఏసీ వెంట్స్, ప్రీమియం ఫ్లోర్ మ్యాట్ అందిస్తోంది.
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్, , ఎలక్ట్రానిక్ బ్రేక్ డిస్ట్రిబ్యూషన్‌తో పాటు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్, పార్కింగ్ సెన్సార్, సెంట్రల్ లాకింగ్, సీట్ బెల్ట్ రిమైండర్, హై స్పీడ్ అలర్ట్ ఉన్నాయి.
హ్యుండయ్ ఎక్స్‌టర్‌లో పెట్రోల్, సీఎన్జీ రెండు మోడల్స్ ఉన్నాయి. రెండింట్లోనూు 1.2 లీటర్ 4 సిలెండర్ నేచురల్ యాస్పిరేటెడ్ ఇంజన్ ఉంటుంది. ఈ ఇంజన్ గరిష్టంగా 81.86 బీహెచ్‌పి శక్తిని, 113 ఎన్ఎం టార్క్ ఉత్పత్తి చేస్తుంది. పెట్రోల్ ఇంజన్ 5 స్పీడ్ మేన్యువల్ గేర్‌బాక్స్ లేదా 5 స్పీడ్ ఏఎంటీతో వస్తుంది.
హ్యుండయ్ ఎక్స్‌టర్ అనేది ఈ ఏడాది అత్యధిక ఆదరణ పొందిన కారు కావచ్చు. ఈ విభాగంలో ఇప్పటి వరకూ టాటా పంచ్ ప్రాబల్యం ఉండేది. ఇప్పుడు ఎక్స్‌టర్ ఆ స్థానాన్ని ఆక్రమించవచ్చు.
హ్యండయ్ ఎక్స్‌టర్ అనేది హ్యుండయ్ వెన్యూ కంటే చిన్నది. మారుతి సుజుకి ఇగ్నిస్, టాటా పంచ్, నిస్సాన్ మేగ్నైట్, రెనాల్ట్ కైగర్‌లతో పోటీ పడుతుంటుంది. అప్పుడే హ్యుండయ్ ఎక్స్‌టర్ బుకింగులు 10 వేలు దాటేశాయి.