Sonu Sood: అమితాబ్‌కు తన స్టోరీ అందజేసిన రియల్ హీరో
కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో అసలు హీరోలు ఎవరు.. రీల్ నటులు ఎవరు అనేది భారత దేశ వ్యాప్తంగా స్పష్టమైంది. సినిమాల్లో విలన్ పాత్రల్లో మెప్పించిన విలన్, సినీ నటుడు సోనూ సూద్(Sonu Sood) ఏంటనేది దేశం మొత్తం చూసింది. వలస కూలీల కష్టాలు చూసి చలించిపోయిన రియల్ హీరో సోనూ సూద్.
Gallery: Anchor Anasuya Photos: పింక్ డ్రెస్సులో యాంకర్ అనసూయ గుబాళింపు
టాలీవుడ్(Tollywood) నటుడు సోనూ సూద్ తన జీవిత కథను పుస్తకం రూపంలో తీసుకువచ్చారు. తాను రచయిగా మారి ఈ ‘ఐ యామ్ నో మెసయ్య’ (I Am No Messiah) అనే ఆత్మకథను రాశారు.
బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్‌కు తన పుస్తకం ‘ఐ యామ్ నో మెసయ్య’ను అందజేశారు. కేబీసీ షోకు వెళ్లి ఆ వేదిక మీద తన పుసక్తం గురించి వివరించి గౌరవపూర్వకంగా బిగ్ బి అమితాబ్‌కు బుక్ అందజేశారు సోనూ సూద్.
Gallery: Iswarya Menon Photos: అందాల ‘ఐశ్వర్య’మా.. పరువాల పావురమా!
మీనా అయ్యర్ కో-రైటర్‌గా పనిచేశారు. తనను ప్రజలు మహా పరుషుడు అని పిలుస్తున్నారు. అయితే తాను మహా పురుషుడిని కాదని తాను నమ్ముతున్నట్లు చెప్పాడు సోనూ సూద్. సాటి మనుషులకు సాయం చేయడం, తన జీవితంలోని అంశాలతో నటుడు సోనూ సూద్ I Am No Messiah పుస్తకాన్ని తీసుకొచ్చారు.
లాక్‌డౌన్ సమయంలో లక్షలాది మంది కార్మికులు, వలస కూలీలను వారి ఇళ్లకు చేర్చేందుకు ఎంతగానో సాయం చేసి రియల్ హీరో అనిపించుకున్నారు సోనూ సూద్. తాను కూడా ఓ వలస కార్మికుడినేనని, ముంబైకి పొట్ట చేతపట్టుకుని వచ్చానంటూ ఓ సందర్భంలో భావోద్వేగానికి లోనయ్యారు. (All Photos: Twitter)