Balalatha: ఐఏఎస్ కొట్టాలంటే అందగత్తెలే కావాలా..?.. స్మితా సబర్వాల్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన బాలలత..
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్ ఎక్స్ వేదికగా చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం దేశంలో తీవ్రదుమారంగా మారాయి. దీనిపై సీఎస్ బీ ఐఏఎస్ అకాడమి చైర్మన్ మల్లవరపు బాలలతో తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. యూపీఎస్సీలో దివ్యాంగులకు కోటా అవసరమా.. అంటూ స్మితా ట్విట్ చేశారు. దీనిపై నెటిజన్లు కూడా స్మితా అదే రేంజ్ లో కౌంటర్ లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై దివ్యాంగులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
సివిల్స్ అకాడమి చైర్మన్ మల్లవరపు బాలలత సోమాజీగూడ ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం నిర్వహించారు. దీనిలో అనేక మంది సివిల్స్ సాధించిన దివ్యాంగులు, దివ్యాంగ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో బాలలత మాట్లాడుతూ.. సీనియర్ ఐఏఎస్ అధికారి స్మితా సబర్వాల్ ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ వ్యక్తులు గురించి ట్వీట్ చేయడం విచారకరమన్నారు. పదేళ్ల పాటు గత ప్రభుత్వ హయాంలో కీలక స్థానంలో ఉన్నఅధికారిణి దివ్యాంగులపై చేసిన వ్యాఖ్యల్ని ఖండిస్తున్నామన్నారు.
స్మితా సబర్వాల్ చేసిన ట్విట్.. దివ్యంగ సమాజాన్ని అవమానపరిచేలా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె చేసిన వ్యాఖ్యలు.. ప్రభుత్వం తరఫున లేక ఆమె వ్యక్తిగతమా అనేది క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెంటనే ఈ ఘటనలో చీఫ్ సెక్రటరీ ఈమె ట్వీట్ పై సమగ్రంగా విచారించాలన్నారు.
స్మితా సబర్వాల్ ఎన్నిగంటలు పనిచేస్తుందో చెప్పాలన్నారు. దివ్యాంగులపై మాట్లాడటానికి ఆమెకు ఉన్న అర్హత ఏంటని బాలలత ప్రశ్నించారు. స్మితా సబర్వాల్ ఎన్నిగంటలు ఫీల్డ్ లో పనిచేస్తారని, చాపర్ లు, ప్రత్యేకంగా సదుపాయాల్లో గత ప్రభుత్వంలో ఎలా పనిచేశారో అందరికి తెలుసన్నారు.
జ్యూడీషీయరీ, పార్లమెంటరీ వ్యవస్థలు తీసుకునే నిర్ణయాలకువ్యతిరేంగా స్మితా కామెంట్ లు చేశారన్నారు. స్మితా తండ్రి సివిల్స్ సాధించారని, ఆమె భర్త ఒక ఐపీఎస్ అని.. కానీ ఎందరో అనేక ఇబ్బందులు ఎదుర్కొని సివిల్స్ సాధిస్తున్నారని బాలలత అన్నారు. స్మితా కు అంతే టాలెంట్ ఉంటే.. తనతో కలసి ఎగ్జామ్ రాయాలని ఎవరికి ఎంత టాలెంట్ ఉందో తెలిసిపోతుందని సవాల్ విసిరారు. స్మితా కోడ్ ఆఫ్ కండెక్ట్, సివిల్స్ సర్వీసెస్ పరిమితులు దాటి వివాదాస్పదంగా మాట్లాడారని బాలలత అన్నారు. దీనిపై వెంటనే సారీ చెప్పాలని డిమాండ్ చేశారు.
యూపీఎస్సీ కొట్టాలంటే అందగత్తెలే కావాల.. అంటూ బాలలత పంచ్ లు వేశారు. స్మితా ఫిజికల్ గానే ఫిట్ అని.. కానీ మెంటల్ గా ఆమె అన్ ఫిట్ అని బాలలత అన్నారు. నిన్నటి నుంచి అన్నిట్విట్ లకు కౌంటర్ ఇస్తున్నారని, పనులున్న అధికారులు ఎవరు ట్విట్టర్ ల ముందు కూర్చుని ఇలా పోస్టులు చేస్తు ఉండరని కూడా సెటైర్ లు వేశారు.
స్మితా సబర్వాల్ కేవలం గుర్తింపు కోసమే ఇలా వ్యాఖ్యలు చేస్తున్నారని బాలలత ఫైర్ అయ్యారు. దివ్యాంగులం సమాజంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని విజయాను సాధిస్తున్నామని, ఇప్పుడు తాము బతకాల లేదా అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుంతం బడ్జెట్ సెషన్ నడుస్తోందని ఈరోజు ఊరుకున్నామని, 24 గంటల్లో ఈ ఘటనపై దివ్యాంగ సమాజానికి సారీ చెప్పకుంటే.. ఎక్కడివరకు వెళ్లడానికైన తాము సిద్ధమే అని బాలలత సవాల్ విసిరారు. దీనిపై సీఎస్, ప్రభుత్వం చర్యలు తీసుకొవాలన్నారు.
అంగవైకల్యం ఉన్న కూడా జైపాల్ రెడ్డి బెస్ట్ పార్లమెంటీయన్ ఘనత సాధించారన్నారు.. స్టీఫిన్ హకింగ్స, సుధా చంద్రన్ లాంటి మేధావులు అంగవైకల్యం ఉన్న కూడా సమాజంలో గొప్ప విజయాలను సాధించారని బాలలత గుర్తు చేశారు. వెంటనే ఈ వ్యాఖలు వెనక్కు తీసుకుని సారీ చెప్పకుంటే , ట్యాంక్ బండ్ మీద నిరసన తెలియజేస్తామని కూడా బాలలత హెచ్చరించారు.