INDW vs BANW: మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవం.. ఆనందంలో మిథాలీ సేన!!

Tue, 22 Mar 2022-5:11 pm,

స్నేహ్‌ రాణా ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో (27 పరుగులు, 4 వికెట్లు) కీలక మ్యాచ్‌లో బంగ్లాపై భారత్‌ 110 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది.

మార్చి 27న దక్షిణాఫ్రికాతో భారత్ తలపడనుంది. ఈ మ్యాచ్‌లోనూ గెలుపొందితే ఇతర జట్ల సమీకరణాలతో సంబంధం లేకుండా సెమీస్‌ బెర్తును ఖరారు చేసుకునే అవకాశం ఉంది.

మహిళల ప్రపంచకప్‌లో భారత్‌ ఆశలు సెమీస్‌ సజీవంగా ఉన్నాయి. బంగ్లాతో జరిగిన మ్యాచ్‌లో భారీ విజయం సాధించిన మిథాలీ సేన  పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి ఎగబాకింది.

స్మృతీ మంధాన (30), షెఫాలీ వర్మ (42) మంచి ఆరంభం ఇవ్వగా.. యస్తిక (50) హాఫ్ సెంచరీతో మెరిసింది. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link