ఈ కొత్త ATM,Banking రూల్స్ తెలియకపోతే ఇబ్బంది పడతారు వెంటనే చదవండి

Mon, 07 Dec 2020-12:01 pm,

LPG ధరల్లో మార్పు వస్తే అది మధ్యతరగతి జీవితాలను ప్రభావితం చేస్తుంది. అయితే డిసెంబర్ 1వ తేదీ నుంచి ఎల్‌పిజి ధరలు ప్రతీ రోజు మారే అవకాశం ఉంది. చమురు సంస్థలు వాటిని రోజూ మార్చే అవకాశం ఉంది.

న్‌లైన్‌లో బ్యాంకింగ్ లావాదేవీలు నిర్వహించే సమయంలో మనకు తరచూ మెసేజులు వస్తుంటాయి. మోసాల నుంచి దూరంగా ఉండేందుకు అందులో ఉన్న చిట్కాలు పాటించాలి అని వస్తుంటాయి. ఎందుకంటే డబ్బు ఒక్కసారి ఖాతాల్లోంచి వెల్లిపోతే అది మళ్లీ ఎప్పుడొస్తుందో తెలియదు. అందుకే ఆన్‌లైన్ బ్యాంకింగ్ చేసే ముందు బ్యాంకు నిర్దేశించిన సూచనలు తప్పుకుండా పాలించాలి.

పంజాన్ నేషనల్ బ్యాంకు వినియోగదారులు ఇకపై వారి ఖాతాల్లోంచి ఏటిఎం నుంచి డబ్బులు తీసుకోవాలి అనుకుంటే తప్పుకుండా ఓటీపి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8గంటల వరకు రూ.10 వేల కన్నా ఎక్కువ మొత్తంలో డబ్బు తీసేవారు తప్పుకుండా ఏటిఎంకు వారి రిజిస్టర్డ్ మొబైల్‌తో వెళ్లాల్సి ఉంటుంది.

ఓటీపి ఆధారంగా ఏటిఎం నుంచి క్యాష్ తీయాలి అనుకుంటే ఇలా చేయండి -PNB ఏటిఎంలోకి వెళ్లండి. -ఏటిఎం మెషిన్‌లో డెబిట్/ ఏటిఎం కార్డు ఇంసెర్ట్ చేయండి - అడిగిన వివరాలు అందించండి. -మీరు రూ.10వేల కన్నా ఎక్కువగా తీస్తే మీ  రిజిస్టర్ మొబైల్ నెంబర్‌పై ఓటిపి వస్తుంది. దాన్ని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. -ఓటిపి ఎంటర్ చేసిన తరువాత క్యాష్ వస్తుంది.  

కప్పుడు RTGS ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే చేయగలిగేవాళ్లం. కానీ కొత్తగా వచ్చిన RBI రూల్ వల్ల ఇక 24 గంటలూ  RTGS చేయవచ్చు. నగదు పరిమితి తొలగించారు.

Also Read | EPFO ఖాతా ఉందా? అయితే ఈ 5 ప్రయోజనాల గురించి తెలుసుకోండి!

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link