Rain alert: మరికాసేపట్లో క్లౌడ్ బరస్ట్.. అస్సలు బైటకు రావొద్దు.. కీలక ఆదేశాలు జారీ చేసిన వాతావరణ కేంద్రం..
మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కేంద్రీకృతమై ఉంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర- దక్షిణ ఒడిశా తీరం వద్ద పశ్చిమ మధ్య బంగాళాఖాతం దాని పరిసర వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావం వల్ల మరికాపేట్లో కుండపోతగా వర్షం కురుస్తుందని తెలుస్తోంది.
వాతావరణ కేంద్రం కీలక అలర్ట్ ను జారీ చేసింది. ఈ నేపథ్యంలో మరో రెండు గంటలలో తెలంగాణలోని హైదరాబాద్ సహా.. పలు జిల్లాలలో కూడా భారీ నుంచి అతి భారీగా వర్షాలు కురుస్తాయని తెలుస్తోంది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కూడా వాతావరణ కేంద్రం హెచ్చరిచ్చింది.
ముఖ్యంగా గంటకు 40 నుంచి 50 కిలో మీటర్ల వేగంతో గాలువు వీచే అవకాశం ఉందని కూడా ఐఎండీ వెల్లడించింది. ఉరుములు, మెరుపుల ప్రభావం వల్ల కూడా భారీగా వర్షం కురుస్తుందని కీలక ఆదేశాలు సైతం జారీ చేసింది. దీని వల్ల లోతట్టు ప్రాంతాల ప్రజలు మరింతగా అప్రమత్తంగా ఉండాలని వెల్లడించింది.
హైదరాబాద్‌లోనే కాదు.. పరిసర జిల్లాలతో పాటు.. మరికొన్ని జిల్లాల్లోనూ భారీ నుంచి అతి భారీ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ కీలకఆదేశాలు జారీ చేసింది. ముఖ్యంగా రంగారెడ్డి, వికారాబాద్, యాదాద్రి భువనగిరి, సంగారెడ్డి, మేడ్చల్, కరీంనగర్, సిద్ధిపేట, మెదక్, కామారెడ్డి, నిర్మల్, ఆదిలాబాద్,రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో రానున్న 2-3 గంటల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ ను జారీ చేసింది.
భారీ వర్ష సూచన నేపథ్యంలో అధికారులు సైతం అలర్ట్ అయ్యారు. ప్రజలను అప్రమత్తం చేస్తూ సూచనలు జారీ చేసినట్లు తెలుస్తోంది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు తమ తమ ఇళ్ల నుంచి అవసరమైతే తప్ప బయటకు రావొద్దని పేర్కొన్నారు. ముఖ్యంగా.. జిల్లాల్లో వ్యవసాయ పనులకు వెళ్లిన వారు వెంటనే తమ ఇళ్లకు వచ్చేయాలని సూచించారు.
కొన్నిసార్లు పిడుగులు పడుతాయని, అందుకే చెట్ల కింద, బహిరంగ ప్రాంతాల్లో ఉండకూడదని అధికారులు కీలక సూచనలు జారీ చేశారు. హైదరాబాద్ లో కూడా భారీగా వర్ష సూచన ఉన్నట్లు వాతావరణ కేంద్రం తెలిపింది. ముఖ్యంగా ఆఫీసులకు వెళ్లిన వారు సాయంత్రం జాగ్రత్తగా ఇంటికి వెళ్లాలని కూడా తెలిపారు.
హైదరబాద్ లో రోడ్లన్ని పూర్తిగా గతుకులుగా మారిపోయిన నేపథ్యంలో.. చాలా చోట్ల ఎక్కడ మెన్ హోళ్లు ఉన్నాయో.. ఎక్కడో గుంతలు ఉన్నాయో.. వర్షం పడినప్పుడు మాత్రం చెప్పలేము. అందుకు టూవీలర్ , కారు ప్రయాణికులు మాత్రం జాగ్రత్తగా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్లాలని కూడా వాతావరణ కేంద్రం అధికారులు హెచ్చరించారు.
అవసరమైతే తప్ప బైటకు రావొద్దని కూడా వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. ఇప్పటికే వరదలు వర్షాల వల్ల ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు కుదేలయ్యాయి. అంతే కాకుండా.. మెయిన్ గా ఏపీలోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మం వరద ప్రభావానికి చిగురుటాకుల్లా వణికిపోయాయని చెప్పుకొవచ్చు. ఇప్పటికి ఆ ప్రాంతాలలోని ప్రజలు పూర్తిగా కోలుకోలేదని చెప్పుకొవచ్చు.