Yashasvi Jaiswal: థర్డ్ అంపైర్ ఓపెన్ చీటింగ్.. జైస్వాల్ అవుట్‌పై నెట్టింట తీవ్ర దూమరం
అప్పటికి టీమిండియా స్కోరు 141 పరుగులకు ఆరు వికెట్లు కోల్పోయింది. హాఫ్ సెంచరీతో క్రీజ్‌లో పాతుకుపోయాడు జైస్వాల్. మరో ఎండ్‌లో వాషింగ్టన్ సుందర్ చక్కటి సహకారం అందిస్తున్నాడు.
ఈ జంట 8 ఓవర్లపాటు ఇవ్వకపోవడంతో డ్రాపై ఆశలు చిగురించాయి. అయితే కమిన్స్ బౌలింగ్‌లో యశస్వి జైస్వాల్ (84) ఔట్ కావడంతో కథ మొత్తం మారిపోయింది.
జైస్వాల్ ఆడిన బంతి నేరుగా వికెట్ కీపర్ క్వారీ చేతుల్లో పడింది. ఆసీస్ ఫీల్డర్లు అప్పీల్ చేయగా.. ఫీల్డ్ అంపైర్ నాటౌట్ ఇచ్చాడు.
ఆసీస్ కెప్టెన్ కమిన్స్ రివ్యూ కోరాడు. రిప్లైలో స్నికో మీటర్‌లో స్పైక్స్ కనిపించలేదు. దీంతో తాను ఔట్ కాలేదని జైస్వాల్ రిలాక్స్ అయ్యాడు.
కానీ థర్డ్ అంపైర్ మాత్రం ఔట్‌గా ప్రకటించాడు. దీంతో జైస్వాల్ తీవ్ర అసహనం వ్యక్తం చేశాడు. స్పైక్స్ లేకున్నా ఎలా ఔట్ ఇస్తారని ఫీల్డ్ అంపైర్లతో చర్చించాడు. బాల్ టర్న్ కావడంతో అంపైర్ ఔటిచ్చాడు. అంపైర్ నిర్ణయం వివాదస్పదంగా మారింది.
అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యక్తం చేస్తునే పెవిలియన్‌కు వెళ్లిపోయాడు. జైస్వాల్ ఔట్ అయిన తరువాత టీమిండియా వేగంగా వికెట్లు కోల్పోయింది.
థర్డ్ అంపైర్ నిర్ణయంపై నెటిజన్లు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. అంపైర్ ఓపెన్ చీటింగ్ చేశాడని.. జైస్వాల్ ఉంటే మ్యాచ్ డ్రాగా ముగిసేదని అంటున్నారు.