Ind Vs Nz 2nd Test Updates: రెండో టెస్టులో కివీస్‌కు బ్యాండ్‌బాజానే.. స్పెషలిస్ట్‌ను దింపుతున్న కెప్టెన్ రోహిత్ శర్మ
రెండో టెస్టుకు తుది జట్టులో భారీగానే మార్పులు జరిగే అవకాశం కనిపిస్తోంది. తొలి టెస్టుకు దూరమైన శుభ్‌మన్ గిల్ తుది జట్టులోకి రానుండగా.. వాషింగ్టన్ సుందర్‌ను మిగిలిన రెండు టెస్టులకు ఎంపిక చేశారు.
సుందర్ రాకతో టీమ్‌లో స్పిన్నర్ల సంఖ్య నాలుగుకు చేరింది. ఇప్పటికే అశ్విన్, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్ ఉండగా.. మళ్లీ వాషింగ్టన్ సుందర్‌కు కబురు పంపించారు.
రెండో టెస్టు పూణే వేదికగా జరగనుంది. ఈ మ్యాచ్‌కు పూర్తిగా స్పిన్ పిచ్ తయారు చేయించి.. అశ్విన్, జడేజాకు తోడు వాషింగ్టన్ సుందర్‌ను ఆడించాలని ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
రెండో టెస్ట్ నుంచి బుమ్రాకు విశ్రాంతినిచ్చి కేవలం ఇద్దరు పేసర్లు సిరాజ్, ఆకాశ్‌దీప్‌ను తుది జట్టులో ఆడించే ఛాన్స్ ఉంది. ఆసీస్‌తో సిరీస్‌కు ముందు బుమ్రాకు కాస్త విరామం ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక శుభ్‌మన్ గిల్ స్థానంలో టీమ్‌లోకి వచ్చిన సర్ఫరాజ్ రెండు చేతులా వచ్చిన అవకాశాన్ని ఒడిసి పట్టేశాడు. దీంతో రెండో టెస్టుకు కేఎల్ రాహుల్ మెడపై కత్తి వేలాడుతోంది.
రిషభ్ పంత్ ఫిట్‌గా లేకపోతే వికెట్ కీపర్‌గా కేఎల్ రాహుల్ తుది జట్టులో ఉంటాడు. ఇక వాషింగ్టన్ సుందర్ కూడా టీమ్‌లో ఉంటే తొమ్మిదో స్థానం వరకు బ్యాటింగ్ డెప్త్ ఉంటుందని కెప్టెన్, కోచ్ భావిస్తున్నారు.