Independence Day 2024: రేపు దేశవ్యాప్తంగా అంబరాన్నంటనున్న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. 4000 మంది ప్రత్యేక అతిథులు
ఈ సారి స్వాతంత్య్రం దినోత్సవ వేడుకలకు వివిధ వర్గాలకు చెందిన ప్రత్యేక అతిథులు రాబోతున్నారు. ముఖ్యంగా ఈ వేడుకలకు రైతులు, యువత, మహిళలు, తక్కవ ఆధాయ వర్గాలవారు రానున్నారు. ఈ నలుగురిని వికసిత్ భారత్‌కు నాలుగు పిల్లర్లుగా అభివర్ణించారు.
స్పెషల్ గెస్ట్ కేటగిరీల వారీగా ఇలా ఉన్నాయి.. వ్యవసాయం, రైతుల సంక్షేమ సెక్టార్ - 1000 అతిథులు యుత్ ఎఫైర్ కేటగిరీ -600 మంది ఉమెన్,శిశు అభివృద్ధి కేటగిరీ-300 పంచాయితీ రాజ్, రూరల్ డెవలప్‌మెంట్ కేటగిరీ -300 ట్రైబల్ ఎఫైర్ కేటగిరీ -350 డిఫెన్స్-200 స్కూల్ ఎడ్యుకేషన్ కేటగిరీ-200 ఆరోగ్యం-150 క్రీడలు-150 నీతి అయోగ్- 1200 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూలు-150 ట్రైబల్ ఆర్టిజన్స్-100 వన్ ధన్ వికాస్ యోజన సభ్యులు, ట్రైబల్ ఎంటర్‌ప్రెన్యూర్ 50 సభ్యులను ఈ వేడుకలకు ఆహ్వానించారు.
అయితే, కొన్ని రిపోర్టుల ప్రకారం 2024 ప్యారీస్ ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఇండియా టీమ్ వారిని కూడా ప్రత్యేక గెస్టులుగా ఆహ్వానించినట్లు తెలుస్తోంది. మొత్తం 18 వేల ఇ- ఇన్విటేషన్స్ 78వ స్వాతంత్య్ర దినోతవ్సం సందర్భంగా పంపించారని తెలుస్తోంది.
ఈ ప్రత్యేక అతిథులు ఆగష్టు 14 న ఢిల్లీ చేరుకోనున్నారు. భారతయుద్ధలకు సంస్మరణార్థం కొంతమంది సీనియర్ మంత్రులు వీరిని కలువనున్నారు. అయితే, ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఓ అరుదైన రికార్డును నెలకొల్పారు. 11 వ సారి వరుసగా జాతిని ఉద్దేశించి ప్రసంగించనున్న రెండో ప్రధానిగా రికార్డు సొంతం చేసుకున్నారు. మొదటి ప్రధాని మంత్రి జవహర్ లాల్ నెహ్రూ.
మహిళ శిశు అభివృద్ధికి సంబంధించిన 161 విభాగాలకు చెందినవారు రాష్ట్ర, కేంద్ర పాలిత ప్రాంతాలకు చెందినవారు తమ కుటుంబ సభ్యులతోపాటు ఈ వేడుకలకు హాజరుకానున్నారు. వీళ్లతోపాటు అంగన్వాడి వర్కర్లు, సఖి వన్ స్టాప్ సెంటర్స్, సంకల్ప్ హాబ్స్ ఎంపార్మెంట్ ఉమెన్, చైల్డ్ వెల్పేర్ కమిటీ, డిస్ట్రిక్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్స్ కూడా ప్రత్యేక అతిథులుగా ఆహ్వానం అందుకున్నారు.