Independence Day 2024: రేపు భారత్‌తోపాటు ఈ 5 దేశాలకు కూడా ఇండిపెన్‌డెన్స్ డే.. ఆ దేశాలు ఏవో తెలుసా?
మన దేశం ప్రతి ఏటా ఆగష్టు 15వ తేదీనా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటాం. మన దేశంతోపాటు మరో 5 దేశాలు కూడా స్వాతంత్య్రం పొందినాయి.ఆ దేశాల జాబితా ఇదే..
సౌత్ కొరియా.. రేపు భారత్‌లోపాటు సౌత్ కొరియా కూడా రిస్టోరేషన్ ఆఫ్ లైట్ డే (Gwangbokjeol) వేడుకలు నిర్వహిస్తారు. జపాన్ నుంచి విముక్తి పొందినప్పటి నుంచి సౌత్ కొరియా ఈరోజు వేడుకలు నిర్వహిస్తోంది.
నార్త్ కొరియా... మన దేశంతోపాటు రేపు స్వాతంత్య్ర దినోత్సవం జరపుకంటున్న మరో దేశం నార్త్ కొరియా. ఆగష్టు 15న లిపరేషన్ డే (Gwangbokjeol) జరుపుకుంటారు. వీళ్లకు కూడా జపాన్ పాలన నుంచి 1945లో విముక్తి లభించింది. అప్పటి నుంచి ఈ వేడుకలు నిర్వహిస్తారు.
రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో.. 1960 ఆగష్టు 15వ తేదీ నుంచి రిపబ్లిక్ ఆఫ్ ది కాంగో కూడా ఫ్రాన్స్ నుంచి స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుంచి కాంగో కూడా ఈరోజున స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహిస్తుంది.
బహ్రెయిన్.. భారత్‌తోపాటు స్వాతంత్య్ర వేడుకలు రేపు జరుపుకోనున్న మరో దేశం బహ్రెయిన్. 1971 ఆగష్టు 15న ఈ దేశం కూడా బ్రిటన్ పాలన నుంచి విముక్తి పొందింది. డిసెంబర్ 16న నేషనల్ డేను జరుపుకుంటారు.
లిక్టెన్‌స్టెయిన్.. ఆగష్టు 15న నేషనల్ డే జరుపుకుంటున్న మరో దేశం లిక్టెన్‌స్టెయిన్. అక్కడి కాథలిక్ చర్చీలలో ఫీస్ట్ కూడా ఈరోజు జరుపుతారు.