Independence Day: ఆగస్టు 15న స్వాతంత్య్ర వేడుకలు జరుపుకునే ఇతర దేశాలేవి
ఉత్తర, దక్షిణ కొరియా
ఇండియాలానే ఉత్తర, దక్షిణ కొరియా దేశాలు ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ జరుపుకుంటున్నా.యి. రెండు దేశాలు ఇదే రోజున కొరియా జాతీయ దినోత్సవాన్ని జరుపుకుంటాయి. రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తరువాతక కొరియాకు జపాన్ దేశం నుంచి స్వాతంత్య్రం లభించింది. 35 ఏళ్ల పాటు జపాన్ కొరియాను పాలించింది. స్వాతంత్య్రం పొందిన మూడేళ్లకో కొరియా రెండుగా చీలిపోయింది.
liechtenstein
లిక్‌టెన్‌స్టీన్ దేశం గురించి చాలా తక్కువ మందికి తెలుసు. ఈ దేశంలో కూడా ఆగస్టు 15న ఇండిపెండెన్స్ డే జరుపుకుంటున్నారు. ఇది ప్రపంచంలో ఆరవ అతి చిన్న దేశం. 1866లో జర్మనీ నుంచి స్వాతంత్య్రం పొందింది. 1940 ఆగస్టు 15 నుంచి జాతీయ దినంగా జరుపుకుంటోంది
రిపబ్లిక్ ఆఫ్ కాంగో
ప్రజాస్వామ్య దేశాల జాబితాలో ఉన్న రిపబ్లిక్ ఆఫ్ కాంగో ఆఫ్రికా ఖండంలోని ఓ దేశం. 1960 ఆగస్టు 15న ఈ దేశానికి స్వాతంత్య్రం లభించింది. అంతకుముందు ఈ దేశం ఫ్రాన్స్ పాలనలో ఉండేది. ఆఫ్రికా ఖండంలో కాంగో మూడవ అతిపెద్ద దేశం.
బహ్రెయిన్
బ్రిటీష్ పాలన నుంచి సరిగ్గా ఇదే రోజున స్వాతంత్య్రం పొందిన మరో దేశం బహ్రెయిన్. 1971 ఆగస్టు 15న బహ్రెయిన్‌కు స్వాతంత్య్రం లభించింది. అయితే ఈ దేశం ఆగస్టు 15న కాకుండా డిసెంబర్ 16న స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటుంది. ఎందుకంటే ఈ రోజునే దివంగత రాజు ఈసా బిన్ సల్మాన్ అల్ ఖలీఫా పాలన చేపట్టాడు.