Big Breaking: అమ్ముల పొదిలో మరో అస్త్రం.. హైపర్ సోనిక్ మిస్సైల్ పరీక్ష విజయవంతం..!
ఇండియన్ ఆర్మీ కోసం డీఆర్‌డీఓ ఆధ్వర్యంలో పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన హైపర్ సోనిక్ మిస్సైల్ ప్రయోగం విజయవంతం అయింది. ఈ క్షిపణి ప్రయోగం ఒడిశాలోని అబ్దుల్ కలాం ఐలాండ్ నుంచి ప్రయోగించారు.
ఈ క్షిపణి పేలోడ్స్ 1500 కిలోమీటర్ల మేర తీసుకెళ్లే సామర్థ్యం కలిగింది. ఈ మిస్సైల్ తయారీలో కీలకపాత్ర పోషించిన డీఆర్‌డీఓ శాస్త్రవేత్తలను రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.
ఈ మిస్సైల్ లాంగ్ రేంజ్ ల్యాండ్ అటాక్ క్రూయిస్ మిస్సైల్ (LRLACM). డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ రూపొందించిన ఈ మిస్సైల్ వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్మాన్ని కూడా గురి తప్పకుండా చేరుకోగలదు.
ఈ పరీక్షలో హైపర్ సోనిక్ మిస్సైల్ గురి తప్పకుండా వెయ్యి కిలో మీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాన్ని ఛేదించి ధ్వంసం చేసింది. ఈ క్షిపణి భారత సాయుధ బలగాలకు ముఖ్యంగా నావికాదళానికి అదనపు సామర్థ్యాన్ని ఇస్తుంది.
ఇప్పటికే రష్యా సహాయంతో క్షిపణుల తయారీలో యాక్టీవ్‌గా ఉన్న భారత్ నేడు సొంత పరిజ్ఞానంతో తయారు చేసిన మరో అస్త్రాన్ని భారత అమ్ముల పొదిలో చేర్చింది. ఈ క్షిపణి అమెరికా టోమాహాక్ క్రూయిజ్‌తో పోలుస్తున్నారు.