Indian Medal Winner Shooters: ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియాకు మెడల్స్ సాధించింది వీళ్లే
భారత మహీళా షూటర్ మనూ భాకర్ పారిస్ ఒలింపిక్స్ 2024లో కాంస్య పతకం గెల్చుకుని చరిత్ర సృష్టించింది. ఒలింపిక్స్ చరిత్రలో ఇండియాకు షూటింగ్ విభాగంలో ఇది ఐదవది. మొదటి మహిళ ఈమెనే. ఇప్పటి వరకూ షూటింగ్ విభాగంలో ఇండియాకు ఐదుగురు పతకాలు సాధించారు.
గగన్ నారంగ్
గగన్ నారంగ్ ఇండియాకు షూటింగ్ విభాగంలో పతకం తెచ్చిపెట్టాడు. 2012 లండన్ ఒలింపిక్స్ లో పురుషుల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్ లో కాంస్య పతకం గెల్చుకున్నాడు.
అభినవ్ బింద్రా
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియాకు రెండవ పతకం అబినవ్ బింద్రా సాధించిపెట్టాడు. 2008 బీజింగ్ ఒలింపిక్స్ లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించాడు. ఒలింపిక్స్ చరిత్రలో షూటింగ్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించిన ఏకైక భారతీయుడు ఇతడే
రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్
ఒలింపిక్స్ షూటింగ్ విభాగంలో ఇండియాకు తొలి పతకం తెచ్చింది ఇతడే. 2004 ఏథెన్స్ ఒలింపిక్స్ లో పురుషుల టబుల్ ట్రాప్ విభాగంలో రజత పతకం గెల్చుుకున్నాడు.
మను భాకర్
తాజాగా 2024 పారిస్ ఒలింపిక్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో కాంస్య పతకం గెల్చుకుంది. ఇండియా తరపున షూటింగ్ విభాగంలో పతకం గెల్చుకున్న తొలి మహిళ.
విజయ్ కుమార్
2012 లండన్ ఒలింపిక్స్ లో షూటింగ్ విభాగంలో మరో పతకం సాధించింది ఇతడే. 25 మీటర్ల ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ విభాగంలో రజత పతకం సాధించాడు.