Airforce Day: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ డే ఉత్సవాల సన్నాహాలు, రిహార్సల్స్ ఫోటోలు వైరల్

Mon, 04 Oct 2021-1:45 pm,

హిందన్ ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో ఈ ప్రదర్శనలు నిర్వహిస్తున్నందున..ఢిల్లీ, ఘజియాబాద్ ప్రాంతాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్త పారవేయవద్దని ఐఏఎఫ్ అధికారులు సూచిస్తున్నారు. 

అక్టోబర్ 8వ తేదీ ఉదయం 8 గంటలకు ఏఎన్ 32 ఎయిర్ క్రాఫ్టుల ప్రదర్శనతో వేడుకలు ప్రారంభం కానున్నాయి. అనంతరం హెరిటేజ్ ఎయిర్ క్రాఫ్ట్, మోడర్న్ ట్రాన్స్‌పోర్ట్, ఫ్రంట్‌లైన్ ఫైటర్ ఎయిర్ క్రాఫ్ట్ ప్రదర్శన ఉంటుంది.

అత్యాధునిక ఎయిర్ క్రాఫ్టులను వేడుకల్లో ప్రదర్శించేందుకు ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ సన్నాహాలు చేసింది. రిహార్సల్స్ ఫోటోల్ని ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

ప్రతియేటా అక్టోబర్ 8న ఎయిర్‌ఫోర్స్ డే జరుపుకుంటాం. 89వ వార్షికోత్సవాల సందర్భంగా ఐఏఎఫ్ ప్రత్యేక ప్రదర్శన నిర్వహించనుంది. ఈ ప్రదర్శనకు సంబంధించి ఇప్పటికే ఐఏఎఫ్ రిహార్సల్స్ పూర్తి చేసింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link