Indian Railways ఉద్యోగుల కోసం కీలక ప్రకటన, ఇక అంతా డిజిటల్ మయం!

Fri, 27 Nov 2020-9:44 pm,

 రైల్వే ఉద్యోగులకు  (Railway employees)శుభవార్త. ఇక రైల్వే ఉద్యోగుల పీఎఫ్ బ్యాలెన్స్ (Railway employees PF balance)  తెలుసుకోవడం , పీఫ్ అడ్వాన్స్  (PF advance) అప్లై చేయడం చాలా సులభంగా మారనుంది.   

ఇండియన్ రైల్వేస్ (Indian Railways) పూర్తిగా డిజిట్ హ్యూమన్ రిసోర్స్ రిసోర్సెస్ మేనేజ్మెంట్ సిస్టం (HRMS) లాంచ్ చేసింది. ఈ కొత్త సదుపాయం వల్ల ప్రస్తుతం రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగులు, విరమణ చేసిన ఉగ్యోగులకు లాభం కలగనుంది.

Also Read | Women Empowerment : మహిళల కోసం ప్రత్యేక సేవింగ్ ఎకౌంట్, వడ్డీ ఎంతో తెలుసా?

HRMS వల్ల ప్రోడక్టివిటి బాగా పెరగుతుంది అని రైల్వే తెలిపింది. దీని కోసం రైల్వేస్ భారీగా ప్రణాళిక సిద్ధం చేస్తోంది. రైల్వేలో పని చేస్తున్న ఉద్యోగులు, విరమణ చేసిన ఉద్యోగులకు దీని వల్ల  ప్రయోజనం కలుగుతుంది

Also Read | IRCTC New Booking Rules: IRCTC నుంచి టికెట్ చేస్తున్నారా ? ఈ కొత్త రూల్ తెలుసుకోండి!

ఇందులో ఎంప్లాయిస్ సెల్ఫ్ సర్వీస్ (ESS) కూడా ఉంటుంది.  రైల్వే ఉద్యోగులు డేటా మార్చడంతో పాటు కమ్యూనికేషన్ , HRMS లోని వివిధ మాడ్యూల్స్  కూడా తెలియజేస్తారు. మరోవైపు Provident Fund (పీఎఫ్) అడ్వాన్స్ మాడ్యూల్ కూడా ఉంటుంది. దీంతో పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేయడం లేదా అడ్వాన్స్ కోసం అప్లై చేయవచ్చు.

Also Read | YES Bank : క్రెడిట్ కార్డు రివార్ట్ ప్రోగ్రామ్ మరింత లాభదాయకంగా మారనుంది

దీంతో పాటు రైల్వే బోర్డు చైర్మన్ తెలిపిన వివరాల ప్రకారం సెటిల్మెంట్ మాడ్యూల్ కూడా అందుబాటులోకి వచ్చిందట. దీన్ని కూడా పూర్తిగా డిజిటలైజ్ చేశారట. దీంతో వేగంగా సెటిల్మెంట్స్ చేసుకోనే వెసులుబాటు కలగనుంది అని తెలిపారు

Also Read | Indane Gas: ఎక్కడి నుంచి అయినా ఇండేన్ గ్యాస్ రీఫిల్ బుక్ చేయవచ్చు

సెటిల్మెంట్ నుంచి ఉద్యోగుల సర్వీస్ వివరాలు మొత్తం డిజిటల్ రూపంలో అందుబాటులోకి తీసుకు వచ్చారు. అంతకు ముందు ఇవన్నీ కాగితాల ద్వారా జరిగేవి. రిటైర్ అయిన ఉద్యగుకు కూడా దీని వల్ల ఉపయోగం కలుగుతంది.Also Read | WhatsApp Pay : వాట్సాప్ పే చేసే సమయంలో గుర్తుంచుకోవాల్సిన 6 విషయాలు

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link