Central Women Scheme: మహిళలకు వడ్డీలేకుండా రూ.5 లక్షల రుణం.. వెంటనే ఇలా అప్లై చేసుకోండి..

Sun, 17 Mar 2024-2:39 pm,

ఈ పథకాన్ని ప్రత్యేకంగా మహిళల అభ్యున్నత్తికి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకంలో భాగంగా మహిళలకు రూ. 5 లక్షలు వడ్డీ లేకుండానే అందిస్తున్నాయి. ఈ పథకానికి మీరూ అర్హులైతే వెంటనే ఇలా అప్లై చేసుకోండి...  

కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకం పేరు లక్ పతి దీదీ. దీన్ని ఇటీవల బడ్జెట్ ప్రవేశపెట్టిన సమయంలో కేంద్ర మంత్రి నిర్మలా సీతారమన్ నోట కూడా విన్నాం. ఈ పథకం ద్వారా పేద మహిళలను లక్షాధికారులను చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకుంది కేంద్ర ప్రభుత్వం.  

లఖ్ పతి దీదీ పథకం కేంద్ర ప్రభుత్వ పథకం. ఇది మహిళా సాధికారతే ఈ పథకం ప్రధాన లక్ష్యం. మహిళా స్వయం సహాకార సంఘంలో ఉండే మహిళలకు స్కిల్ ట్రైనింగ్ పొందుతారు. వీళ్ళందరికీ రూ. లక్ష నుంచి 5 లక్షల వరకు వడ్డీలేని రుణాలు అందిస్తారు. 

లక్ష కంటే తక్కువ ఆదాయం కలిగిన మహిళలు ఆ పథకం ద్వారా లబ్ది పొందుతారు.ఈ స్కిల్ ట్రైనింగ్‌ లో భాగంగా మహిళలకు ఎల్ ఈ డీ బల్బలు, ప్లంబింగ్, డ్రోన్ రిపెయిరింగ్ మొదలైన టెక్నికల్ స్కిల్స్ నేర్పిస్తారు.  

ఈ పథకం లబ్ది పొందాలంటే మహిళా స్వయం సహాకార సంఘంలో చేరాలి. దీనికోసం మరింత సమాచారం కావాలంటే స్థానికంగా ఉండే అంగన్వాడి సెంటర్లను సంప్రదించాలి.  

ఈ పథకంలో చేరాలంటే కావాల్సిన డాక్యుమెంట్స్.. ఆధార్ కార్డు, పాన్ కార్డు, అడ్రస్ ప్రూఫ్, బ్యాంక్ అకౌంట్ డిటెయిల్స్, ఇన్ కం సర్టిఫికేట్, పాస్ పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, రిజిస్టర్డ్ మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడీ కలిగి ఉండాలి. ఈ పథకం ప్రధాన లక్ష్యం పేద మహిళలను ఆర్థికంగా ప్రోత్సహించి వారిని లక్షాధికారులను చేయడం, స్వయం సాధికారికతను సాధించడం.(Disclaimer: ఈ కథనం ఇంటర్నేట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా రాసినది. Zee News Media కి దీనిని ధృవీకరించడం లేదు. )

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link