Jasprit Bumrah love story: జస్ప్రీత్ బుమ్రా- సంజనా గణేశన్ లవ్ స్టోరీ
జస్ప్రీత్ బుమ్రా భార్య సంజనా గణేశన్. స్టార్ స్పోర్ట్స్‌లో ప్రముఖ యాంకర్. 2017లో ఐపీఎల్ సందర్భంగా వీరిద్దరూ తొలిసారి కలుసుకున్నారు.
మొదటి సమావేశంలో సంజన చాలా అహంకారంతో ఉందని బుమ్రా భావించాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బుమ్రా విషయంలో సంజనాకు కూడా అలాగానే అనిపించిందట.
ఆ తర్వాత బుమ్రా, సంజనా గణేశన్ సోషల్ మీడియా ద్వారా ఫ్రెండ్స్ అయ్యారు. తర్వాత వీరిద్దరి స్నేహం ప్రేమగా మారింది. 2019లో ఒకరికి ఒకరు ప్రపోజ్ చేసుకున్నారు.
యార్కర్లతో ప్రపంచ దిగ్గజ బ్యాట్స్‌మెన్‌లను బౌల్డ్ చేసిన బుమ్రాను సంజనా తన ప్రేమతో క్లీన్ బౌల్డ్ చేసింది.
దీని తరువాత, బుమ్రా మరియు సంజన సీక్రెట్ గా రెండేళ్ల పాటు డేటింగ్ చేశారు. 2021లో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. మార్చి 15, 2021న వీరి వివాహం జరిగింది.
సంజనా గణేశన్ స్పోర్ట్స్ యాంకర్ కాకముందు మోడలింగ్ చేసింది. ఇందులో మంచి పేరు సంపాదించింది. మిస్ ఇండియా పోటీల్లో సంజన ఫైనల్ వరకు వెళ్లింది. క్రికెట్‌పై తనకున్న పరిజ్ఞానం అద్భుతమని బుమ్రా ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు.