Candyologists: క్యాండీ అంటే ఇష్టమా, అయితే క్యాండీ తినే ఉద్యోగం మీ కోసం, ఎలాగో తెలుసా
క్యాండీ ఫన్‌హౌస్ తన వెబ్‌సైట్‌లో ఈ ఉద్యోగం గురించి ప్రకటన ఇచ్చింది. దరఖాస్తు చేయడానికి చివరి తేదీ ఫిబ్రవరి 15. ఇంకెందుకు ఆలస్యం. వెంటనే కంపెనీ వెబ్‌సైట్ క్లిక్ చేసి..లక్షల జీతం లభించే ఉద్యోగం కోసం అప్లై చేయండి
ముఖ్యమైన విషయం ఏంటంటే..క్యాండీ ఫన్‌హౌస్ మీకు ఇంట్లో కూర్చునే పని చేసే అవకాశమిస్తోంది. మీరు చేయాల్సిందల్లా ప్రొడక్ట్ టేస్ట్ చేయడమే. టేస్ట్ చేసి..ఆ క్యాండీలో ఏది బాగుంది..ఏం బాగాలేదో చెప్పాల్సి ఉంటుంది. ఇందులో ఇంకెలాంటి ఫ్లేవర్ వినియోగించాలా చెప్పాల్సి ఉంటుంది.
ప్రతి గంటకు 47 డాలర్లు చెల్లిస్తామని కెనడా కంపెనీ ప్రకటించింది. ఈ లెక్కన మీరు రోజుకు 8 గంటలు పని చేసినా సరే..రోజుకు 376 డాలర్లు అంటే 27 వేల 447 రూపాయలు సంపాదించవచ్చు. నెలకు 8 లక్షల 23 వేల 410 రూపాయలవుతుంది.
ఆ కంపెనీ పేరు క్యాండీ ఫన్‌హౌస్. కెనడా దేశంలోని ఓంటారియో రాష్ట్రంలో ఉన్న సినిసావుగా నగరంలో ఉంది. ఈ కంపెనీకు ఫుల్‌టైమ్, పార్ట్‌టైమ్ ఆధారంగా క్యాండియోలాజిస్ట్ అవసరముంది. కంపెనీ తయారు చేసే క్యాండీల టేస్ట్ చూసి..ప్రపంచానికి చెప్పడమే.
మీకు క్యాంటీ తినడం బాగా ఇష్టమా..అయితే ఈ ఉద్యోగం మీ కోసమే. వివిధ రకాల క్యాండీలు టేస్ట్ చేసి విశ్లేషించే సామర్ధ్యముందా..అయితే లక్షల్లో జీతం లభించే ఉద్యోగముంది. అవును నిజమే..ఓ కంపెనీ...క్యాండీ టేస్ట్ చేసి విశ్లేషించే సామర్ధ్యమున్న వ్యక్తి కోసం అణ్వేషిస్తోంది. దీనికి భారీ జీతమే ఇస్తుందట. ప్రపంచంలోని ఏ మూలన ఉండైనా ఉద్యోగం చేయవచ్చు.