Interview Tips: ఇంటర్వ్యూ ఎలా ఫేస్ చేయాలి, గుర్తుంచుకోవల్సిన 5 ముఖ్యమైన అంశాలు
కంపెనీ, పోస్ట్ గురించి తెలుసుకోవడం
అన్నింటికంటే ముందు ఏ కంపెనీ, పోస్ట్ కోసం ఇంటర్వ్యూకు వెళ్తున్నారా దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. కంపెబ్‌సైట్, సోషల్ మీడియా ఇతర మాధ్యమాల ద్వారా తెలుసుకోవచ్చు. ఇది ఇంటర్వ్యూలో ఉపయోగపడుతుంది.
ప్రశ్నలు సిద్ధం చేసుకోవడం
ఇంటర్వ్యూలో చాలా ప్రశ్నలు అడగవచ్చు. కంపెనీ, పోస్ట్ సంబంధిత ప్రశ్నలకు తయారు చేసుకోండి.
సాధారణంగా ఇంటర్వ్యూల్లో అడిగే ప్రశ్నలకు సమాధానం సిద్ధం చేసుకోవాలి. ఉదాహరణకు మీ గురించి చెప్పడం, ఈ పోస్ట్ కోసం ఎందుకు అప్లై చేశారు, మీ బలం బలహీనత ఏంటి, మీరు ఎంత జీతం కోరుకుంటున్నారనేవి ఉండవచ్చు
ఎలా సిద్ధమవాలి
మీ రెజ్యూమ్, కవర్ లెటర్ పరిశీలించుకోండి. అందులో ఇచ్చిన సమాచారం గుర్తుంచుకోవాలి. మీ సామర్ధ్యం, బలహీనతల గురించి ఆలోచించుకుని సమాధానం ఇవ్వాలి
పాజిటివ్ బాడీ లాంగ్వేజ్
ఇంటర్వ్యూ సమయంలో ఆత్మ విశ్వాసంతో ఉండాలి. సమాధానం ఆత్మ విశ్వాసంతో ఇవ్వాలి. స్పష్టంగా మాట్లాడాలి. ఐ టు ఐ కాంటాక్ట్ ఉండాలి. చిరునవ్వు చెదరకుండా ఉండాలి.