IPL 2021 Auction: ఐపీఎల్ 2021 వేలంలో ఎక్కువ ధర పలికేది వీళ్లే..

Wed, 10 Feb 2021-11:27 pm,

ఆస్ట్రేలియన్ స్టార్ ఓపెనర్ ఆరోన్ పించ్ గత సీజన్‌లో ఆర్సీబీ జట్టు తరపున ఆడాడు. పెద్దగా పెర్ఫార్మ్ చేయలేకపోయాడు. అందుకే ఆర్సీబీ ఇతడిని రిలీడ్ చేసేసింది. అయితే ఇటీవల మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఈ నేపధ్యంలో వేలంలో పించ్ కోసం పోటీ ఉండవచ్చు. చెన్నై సూపర్ కింగ్స్ , కేకేఆర్, పంజాబ్ జట్లు అతడి కోసం తీవ్రంగా ప్రయత్నించవచ్చు.

ఆర్సీబీ ఆల్ రౌండర్ మొయీన్ అలీ కూడా ఈసారి మరో టీమ్‌లో చేరవచ్చు. ఎందుకంటే అతడిని కూడా టీమ్ రిలీజ్ చేసింది. అతడి ఐపీఎల్ కెరీర్ పరిశీలిస్తే..19 మ్యాచ్‌లలో 309 పరుగులు సాధించి..పది వికెట్లు తీసుకున్నాడు.

క్రిస్ మోరిస్...కోసం ఈసారి జట్ల మధ్య పోటీ తీవ్రంగా ఉండబోతుంది. మోరిస్ 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేస్తాడు. అంతేకాదు..అద్భుతమైన బ్యాటింగ్ కూడా క్రిస్ మోరిస్ సొంతం. మోరిస్ ఆల్ రౌండర్ కావడంతో జట్టుకు వరమవుతుంది. ఈ కారణంగా ఫ్రాంచైజీలు ఇతడిని ఎక్కువ ధర చెల్లించి తీసుకోవచ్చు.

ఐపీఎల్ వేలం 2021 సమయంలో ఆస్ట్రేలియా స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్ భారీ వేలానికి వెళ్లవచ్చు. ఇటీవలే రాజస్థాన్ రాయల్స్ అతడిని రిలీజ్ చేసింది. ఈ సమయంలో స్మిత్ గొప్ప ఫామ్‌లో ఉన్నాడు. ఆర్సీబీ సహా చాలా జట్లకు ఓపెనర్  అవసరం ఉంది. ఇతడిని కొనుగోలు చేసేందుకు ఫ్రాంచైజీల మధ్య పోరు ప్రారంభం కావచ్చు.

గ్లేన్ మ్యాక్స్‌వెల్. కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టులో ఫ్లాప్ అయ్యాడు. చాలాసార్లు ఈ ఆస్ట్రేలియన్ ఆటగాడికి టీమ్ అవకాశమిచ్చింది. కానీ అవకాశాన్ని వినియోగించుకోలేకపోయాడు. ఈ నేపధ్యంలో పంజాబ్ జట్టు అతడిని రిలీజ్ చేసేసింది. మ్యాక్స్‌వెల్ కూడా గొప్ప  ఆటగాడే. అతడి హిట్టింగ్‌పై ఎవరికీ అనుమానం లేదు. ఈ సీజన్‌లో వేలంలో మ్యాక్స్‌వెల్ కోసం వేలం ఎక్కువగానే ఉండవచ్చు.

కేదార్ జాదవ్. గత సీజన్‌లో నిరాశాజనకమైన ప్రదర్శన చూపించిన ధోనీ టీమ్  సీఎస్‌కే‌కు చెందిన కేదార్ జాదవ్ వేలానికి సిద్ధంగా ఉన్నాడు. అతడు 87 మ్యాచ్‌లలో 1141 పరుగులు సాధించాడు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link