Virat Kohli: విరాటనామ సంవత్సరం.. కోహ్లీ విధ్వంసం సృష్టించిన సీజన్ గుర్తుందా..!
2016 ఐపీఎల్‌లో విరాట్ కోహ్లీ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఈ సీజన్‌లో అనేక రికార్డులు తన మీరు లిఖించుకున్నాడు.
ఈ సీజన్‌లో విరాట్ 4 సెంచరీలు సాధించాడు. కోహ్లీ తరువాత ఏ ఆటగాడు కూడా ఒకే సీజన్‌లో నాలుగు సెంచరీలు చేయలేదు.
ఈ ఐపీఎల్ సీజన్‌లో ఆడిన 16 మ్యాచ్‌ల్లో విరాట్ కోహ్లీ 81.08 సగటుతో రన్స్ చేయడం విశేషం. ఇప్పటివరకు ఈ రికార్డుకు దరిదాపుల్లో కూడా ఎవరూ రాలేదు.
ఈ సీజన్‌లో కోహ్లీ 16 మ్యాచ్‌ల్లో 973 రన్స్ చేశాడు. ఐపీఎల్ సీజన్‌లో ఏ బ్యాట్స్‌మెన్ చేసిన అత్యధిక పరుగులు ఇవే. ఇప్పటివరకు ఏ ఆటగాడు 800 పరుగులు కూడా దాటలేదు. ఈ రికార్డును బద్దలు కొట్టడం అసాధ్యంగా కనిపిస్తోంది.