IPL 2024: ఐపీఎల్ వేటకు సిద్ధం.. సొంత జట్లకు తిరిగి వచ్చిన ఆటగాళ్లు వీళ్లే..!
ముంబై ఇండియన్స్‌ను 2022లో హార్థిక్ పాండ్యాను వదులుకోగా.. మెగా వేలానికి ముందే గుజరాత్ టైటాన్స్ తీసుకుని కెప్టెన్‌గా ఎంపిక చేసింది. తొలి సీజన్‌లోనే గుజరాత్‌ను విజేతగా నిలిపిన పాండ్యా.. గత సీజన్‌లో ఫైనల్‌కు చేర్చాడు. ఈ సీజన్‌కు తిరిగి ముంబై జట్టులో చేరాడు ఈ స్టార్ ఆల్‌రౌండర్. రోహిత్ శర్మ స్థానంలో కెప్టెన్‌గా వ్యవహరించనున్నాడు.
బౌలింగ్ ఆల్-రౌండర్ శార్దూల్ ఠాకూర్ తిరిగి చెన్నై సూపర్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగుతున్నాడు. ధోని కెప్టెన్సీలో సీఎస్‌కే జట్టుకు ప్రాతినిధ్యం వహించిన శార్దూల్‌ను ఆ తరువాత ఢిల్లీ క్యాపిటల్స్ తీసుకుంది. ఈ సీజన్‌కు ముందు జరిగిన మినీ వేలంలో ఠాకూర్‌ను చెన్నై జట్టు రూ.4 కోట్లకు కొనుగోలు చేసింది.
కోల్‌కతా నైట్ రైడర్స్ తరఫున మనీష్ పాండే ఎన్నో మ్యాచ్‌లు ఆడి.. మంచి పేరు సంపాదించుకున్నాడు. ఆ తరువాత సన్‌రైజర్స్ హైదరాబాద్ కొనుగోలు చేసింది. ఎస్‌ఆర్‌హెచ్ రిలీజ్ చేసిన తరువాత ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్ జట్ల తరుఫున కూడా ఆడాడు. ఈ సీజన్‌కు వేలంలో బేస్ ప్రైస్ రూ.50 లక్షలకు మనీష్ పాండేను కేకేఆర్ తీసుకుంది.
మిచెల్ స్టార్క్‌ని కోల్‌కతా నైట్ రైడర్స్ గతంలోనే వేలంలో తీసుకుంది. కానీ వ్యక్తిగత కారణాలతో స్టార్క్ చివరి నిమిషంలో వైదొలిగాడు. ఐపీఎల్ 2024 వేలంలో స్టార్క్‌ను రికార్డు స్థాయిలో రూ.24.75 కోట్లకు కేకేఆర్ కొనుగోలు చేసింది.
శ్రేయాస్ గోపాల్ ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్ తరుఫున కెరీర్‌ను ప్రారంభించాడు. ఆ తరువాత వేరే ఫ్రాంచైజీలకు ఆడిన శ్రేయాస్‌ను ఈ వేలంలో రూ.20 లక్షలకు ముంబై మళ్లీ తీసుకుంది. పీయూష్ చావ్లాకు ప్రత్యామ్నాయంగా ముంబై జట్టులోకి తీసుకుంది.