IPL 2025 Mega Auction: ఓ ఆటగాడి కోసం కావ్య మారన్, ప్రీతి జింటా మధ్య బిగ్ ఫైట్.. ఆ సెన్సేషనల్ ప్లేయర్ ఎవరంటే..?
ఈసారి వేలంలో ఓ ఆటగాడి కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్ ఓనర్ కావ్య మారన్, పంజాబ్ కింగ్స్ సహ యాజమాని ప్రీతి జింటా మధ్య పోటీ జరిగే అవకాశం ఉంది.
ఇటీవల టీ20 వరల్డ్ కప్‌లో అమెరికా తరుఫున అదరగొట్టాడు భారత సంతతికి చెందిన ప్లేయర్ సౌరభ్ నేత్రవాల్కర్. ఆల్‌రౌండర్‌గా దుమ్ములేపిన ఈ ప్లేయర్.. తమ జట్టును సూపర్-8 చేర్చడంలో కీ రోల్ ప్లే చేశాడు. ఈ ప్లేయర్ కోసం కావ్య మారన్, ప్రీతి జింటాతోపాటు ఇతర ఫ్రాంచైజీలు కూడా గట్టిగానే ప్రయత్నించవచ్చు.
సౌరభ్ నేత్రవాల్కర్ టీమిండియా తరుఫున అండర్-19 టీమ్‌కు ఆడాడు. ఆ తరువాత వృత్తి రీత్యా అమెరికాకు వెళ్లి సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్నాడు.
అమెరికా వెళ్లిన తరువాత ఇంజనీర్‌గా పనిచేస్తునే అమెరికా తరుఫున క్రికెట్ ఆడటం మొదలు పెట్టాడు.
టీ20 ప్రపంచకప్‌లో యూఎస్‌ఏను గ్రూప్ దశ నుంచి సూపర్-8 చేరడంలో సౌరభ్ నేత్రవాల్కర్‌దే కీలక పాత్ర.
టీ20 వరల్డ్ కప్ లో 6 మ్యాచ్‌ల్లో 6.63 ఎకానమీతో 6 వికెట్లు పడగొట్టాడు.
ఈ ప్లేయర్ ఐపీఎల్ వేలంలోకి వస్తే కనకవర్షం కురిపించే అవకాశం ఉందని క్రికెట్ పండితులు అంటున్నారు. ముందుగా కావ్య మారన్, ప్రీతి జింటా తమ జట్టులోకి తీసుకునేందుకు పోటీ పడే అవకాశం ఉంది.