IPL 2023 Released Players: కాసుల వర్షం కురిపించి మొఖం చాటేశారు.. ఈ ఐదుగురు ఆటగాళ్లపై ఓ లుక్కేయండి

Wed, 16 Nov 2022-11:46 am,

మయాంక్ అగర్వాల్‌ను పంజాబ్ కింగ్స్ గత సీజన్‌లో రూ.12 కోట్లకు అట్టిపెట్టుకుంది. కెప్టెన్సీ బాధ్యతలు కూడా అప్పగిచింది. అయితే అతను కెప్టెన్సీతో పాటు బ్యాట్‌తో ఘోరంగా విఫలమయ్యాడు. ఐపీఎల్ 2022లో అతను 196 పరుగులు మాత్రమే చేయగలిగాడు. పంజాబ్ కింగ్స్ ప్లే ఆఫ్స్‌కు కూడా చేరుకోలేకపోయింది. దీంతో ఈసారి మయాంక్‌ను పంజాబ్ కింగ్స్ వదులుకుని.. శిఖర్ ధావన్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు అప్పగించింది.  

గతేడాది సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ముందుండి నడిపించిన న్యూజిలాండ్ కెప్టెన్ కేన్ విలియమ్సన్‌ను జట్టు విడుదల చేసింది. ఐపీఎల్ 2022లో తన స్థాయికి తగ్గట్టుగా రాణించలేకపోయాడు. కేవలం 216 పరుగులు మాత్రమే చేశాడు. కెప్టెన్‌గానూ విఫలమయ్యాడు. దీంతో ఎస్‌ఆర్‌హెచ్‌ యజమాన్యం సాగనంపింది.   

చెన్నై సూపర్ కింగ్స్‌ను ఎన్నో మ్యాచ్‌ల్లో ఒంటి చెత్తో గెలిపించాడు వెస్టిండీస్ స్టార్ ఆల్ రౌండర్ డ్వేన్ బ్రావో. అయితే గత సీజన్‌లో చెన్నై తరఫున 10 మ్యాచ్‌లు ఆడి 16 వికెట్లు పడగొట్టి.. 6 ఇన్నింగ్స్‌ల్లో 23 పరుగులు మాత్రమే చేశాడు. దీంతో ఏడాది ఐపీఎల్‌కు బ్రావోను సీఎస్‌కే అట్టిపెట్టుకోలేదు. బ్రావోను గత ఐపీఎల్ మెగా వేలంలో రూ.4.4 కోట్లకు కొనుగోలు చేసింది.   

వెస్టిండీస్ స్టార్ ఫాస్ట్ బౌలర్ ఒడియన్ స్మిత్‌ను పంజాబ్ కింగ్స్ 6 కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. అయితే ఏ మాత్రం ప్రభావం చూపలేదు. 6 మ్యాచ్‌ల్లో 6 వికెట్లు మాత్రమే తీశాడు. దీంతో ఈసారి జట్టు నుంచి తప్పించింది.    

ఐపీఎల్ మెగా వేలంలో జేసన్ హోల్డర్‌ను లక్నో సూపర్ జెయింట్ రూ.8.75కి కొనుగోలు చేసింది. కానీ అతను పెద్దగా రాణించలేకపోయాడు. బంతితో పర్వాలేదనిపించినా.. బ్యాట్‌తో ఫెయిల్ అయ్యాడు. 12 మ్యాచ్‌లలో అతను 58 పరుగులు మాత్రమే చేశాడు. బౌలింగ్‌లో 14 వికెట్లు తీసుకున్నాడు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link