Fastest 50 in IPL: ఐపీఎల్ చరిత్రలో అత్యంత వేగంగా హాఫ్ సెంచరీ బాదిన టాప్-5 ప్లేయర్లు వీళ్లే..
2018లో పంజాబ్ కింగ్స్ తరుఫున బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ ఢిల్లీ క్యాపిటల్స్‌పై కేవలం 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్ చేరుకున్నాడు. ఐపీఎల్ అత్యంత వేగవంతమైన అర్ధశతకం ఇదే. ఈ ఇన్నింగ్స్‌లో ఆరు ఫోర్లు, నాలుగు సిక్సర్లు ఉన్నాయి.
కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పాట్ కమ్మిన్స్ ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై గతేడాది కేవలం 14 బంతుల్లోనే అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
2014లో కేకేఆర్‌కు ప్రాతినిధ్యం వహించిన యూసుఫ్ పఠాన్ 15 బంతుల్లోనే ఎస్‌ఆర్‌హెచ్‌పై ఫిఫ్టీ కొట్టేశాడు. పఠాన్ 22 బంతుల్లో ఐదు బౌండరీలు, 7 సిక్సర్ల సాయంతో 72 పరుగులు చేశాడు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరుపై 15 బంతుల్లో అర్ధశతకం పూర్తి చేశాడు సునీల్ నరైన్. ఈ మ్యాచ్‌లో నరైన్ 17 బంతుల్లో ఆరు బౌండరీలు, నాలుగు సిక్సర్ల సాయంతో 54 పరుగులు చేశాడు.
నికోలస్ పూరన్ ఈ సీజన్‌లో ఆర్‌సీబీపై ఆకాశమే హద్దుగా చెలరేగి ఆడాడు. కేవలం 15 బంతుల్లోనే 50 పరుగులు చేసి ఈ సీజన్‌లో అత్యంత వేగంగా 50 రన్స్ చేసిన ఆటగాడిగా నిలిచాడు.