Pawan Kalyan: జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య, జన సైనికులను కోల్పోవడం బాధించింది
ఎన్ని కష్టాలు ఎదురైనా జనసేన పార్టీ ప్రజలతోనే ఉంటుందని, ప్రజల కన్నీళ్లు తుడవటమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు. ఆంధ్రప్రదేశ్, మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో పార్టీ నేతలతో బుధవారం నాడు పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. (Photos Credit: Twitter/@JanaSenaParty)
ప్రస్తుత పరిస్థితిలో జనసేన పార్టీ నడపడం సాహసోపేతమైన చర్య అని, మీ అందరి ఆదరాభిమానాలతో ప్రజలకు మరింత సేవ చేద్దామని పార్టీ నేతలకు, కార్యకర్తలకు పవన్ కళ్యాణ్ పిలుపునిచ్చారు. కొవిడ్ బారినపడి మృతి చెందిన వారికి జనసేన అధ్యకుడు పవన్ కళ్యాణ్ సంతాపం తెలిపారు. 2 నిమిషాల పాటు మౌనం పాటించారు. కరోనా సమయంలో ప్రజలు చాలా చాలా ఇబ్బందులు పడ్డారు. అయినా కరోనా సమయంలో జన సైనికులు ప్రజలకు అండగా ఉన్నారని కొనియాడారు. (Photos Credit: Twitter/@JanaSenaParty)
కరోనా మహమ్మారి కారణంగా జన సైనికులను కోల్పోవడం తనను వ్యక్తిగతంగా ఎంతో బాధించిందన్నారు. ఈ కష్టకాలంలో జన సైనికులు ఎంతో మంది సేవా కార్యక్రమాలలో పాల్గొన్నారని, లక్ష మంది కార్యకర్తలకు జనసేన తరపున భీమా సౌకర్యం కల్పించామని తెలిపారు. పార్టీ బీమా పథకానికి తనవంతుగా రూ.కోటి విరాళం అందించానని పేర్కొన్నారు. (Photos Credit: Twitter/@JanaSenaParty)
ప్రాణాలను ఫణంగా పెట్టి జనసేన కార్యకర్తలు, నేతలు ముందుకు వెళుతున్నారని వారి సేవలను ప్రశంసించారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడటానికి జనసేన కృషి చేస్తుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. (Photos Credit: Twitter/@JanaSenaParty)
అంతకుముందు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడనుండి రోడ్డుమార్గంలో నేరుగా మంగళగిరి జనసేన పార్టీ ప్రధాన కార్యాలయం చేరుకుని పార్టీ వ్యవహారాల కమిటీ సమావేశంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. జనసేన పోరాటం కొనసాగుతూనే ఉంటుందని, ప్రజలకు తాము ఎప్పుడూ అండగా నిలుస్తామని పేర్కొన్నారు. (Photos Credit: Twitter/@JanaSenaParty)