Janhvi Kapoor: ‘దేవర’తో జాన్వీ కపూర్ ఆ హోదా అందుకుంటుందా..!

Wed, 25 Sep 2024-8:45 am,

  జాన్వీ కపూర్.. తల్లి శ్రీదేవి రూట్లోనే తెలుగు చిత్రాతలతోనే ప్యాన్ ఇండియా హీరోయిన్ కావాలని ప్రయత్నాలు చేస్తుంది. అందుకు  దక్షిణాది సినీ ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ‘దేవర’ మూవీతో కథానాయికగా ఎంట్రీ ఇస్తుంది.ఈ సినిమా సక్సెస్ అయితే.. ప్యాన్ ఇండియా లెవల్లో హీరోయిన్ గా జాన్వీ కపూర్ కు మంచి గుర్తింపు వచ్చే అవకాశాలున్నాయి. 

జాన్వీ కపూర్ హీరోయిన్ గా సినీ ఇండస్ట్రీలో  అడుగుపెట్టి  దాదాపు అర పుష్కరం పూర్తి కావొచ్చింది. అయినా ఇప్పటికీ కథానాయికగా  సరైన బ్రేక్ మాత్రం రాలేదనే చెప్పాలి. అందుకే ఇపుడే సౌత్ సినీ ఇండస్ట్రీపై కన్నేసింది.  

జాన్వీ కపూర్.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ డైరెక్షన్ లో తెరకెక్కుతోన్న ‘దేవర’ మూవీతో టాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. ఈ సినిమాతో ప్యాన్ ఇండియా స్టార్ గా  జాన్వీ పేరు మారు మారుమోగుతుందని  అభిమానులు ఆశిస్తున్నారు. ఈ సినిమా ఈ నెల  27న ఈ చిత్రం రిలీజ్ కాబోతుంది. ఈ సక్సెస్ అనేది ఎన్టీఆర్, కొరటాల శివతో పాటు జాన్వీ కూడా కీలకం అని చెప్పాలి.    

 

మొత్తంగా తెలుగులో ఎన్టీఆర్ తో చేస్తోన్న దేవర రెండు పార్ట్ లతో  పాటు రామ్ చరణ్‌ తో చేస్తోన్న RC 16 చిత్రాలలతో తెలుగులో పూర్తి స్థాయిలో జెండా ఎగరేయానలి చూస్తుంది జాన్వీ. 

జాన్వీ ఫస్ట్ మూవీ  

ఫస్ట్ సినిమా 'ధడక్‌' చిత్రంతో  కథానాయికగా ఎంట్రీ ఇచ్చింది జాన్వీకపూర్. ఆ చిత్రం బాక్సాఫీస్ దగ్గర మంచి సక్సెస్ అందుకుంది.  కానీ ఆ త‌ర్వాత జాన్వీ యాక్ట్ చేసిన  సినిమాలు ఎక్కువగా ఓటీటీ వేదిక‌గానే రిలీజయ్యాయి.

 

జాన్వీ కపూర్.. శ్రీదేవి కూతురుగానే వరుస ఛాన్సులు వస్తున్నాయనే చెప్పాలి. శ్రీదేవి అభిమానిగా ఎన్టీఆర్.. తన మూవీలో ఈ భామకు ఛాన్స్ ఇచ్చినట్టు తెలుస్తుంది. హిందీలో సరైన బ్రేక్ రాకపోవడంతో వరుసగా తెలుగులో సినిమాలు చేస్తోంది. అది కూడా తెలుగులో బడా స్టార్ హీరోల సినిమాలతో టాలీవుడ్ లో సత్తా చాటే ప్రయత్నాలు ముమ్మురం చేసింది.  

జాన్వీ కపూర్..రాజమౌళి, మహేష్ బాబు సినిమాతో  పాటు ప్రభాస్ చిత్రాల్లో దాదాపు జాన్వీ కథానాయికగా తీసుకోబోతున్నట్టు వార్తలు వస్తున్నాయి. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link